icon icon icon
icon icon icon

Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా హవా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు పలు ప్రముఖ నేతల భవితవ్యాన్ని నిర్ణయించాయి. 

Published : 03 Dec 2023 17:48 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly election Results) భాజపాకు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. పలువురు ప్రముఖుల గెలుపోటములు ఇలా ఉన్నాయి.

  • 77 వేల భారీ మెజార్టీతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ బుద్నీ నుంచి విజయం సాధించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ ఛింద్వాఢాలో ఆధిక్యంలో ఉన్నారు.
  • రాజస్థాన్‌లో విద్యాధర్ నగర్ నుంచి భాజపా అభ్యర్థి దియా కుమారి విజయం దక్కించుకున్నారు. రాజస్థాన్ సీఎం పదవికోసం పోటీ పడుతున్నవారిలో ఈమె పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
  • రాజస్థాన్‌లో భాజపా అభ్యర్థి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ జోత్వాఢాలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌధరీపై విజయం సాధించారు. 
  • సర్దార్‌పురలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ 26 వేల ఓట్ల తేడాతో విజయం సాధించగా.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ టోంక్ నుంచి గెలుపొందారు.  
  • రాజస్థాన్‌లో మాజీ సీఎం, భాజపా అభ్యర్థి వసుంధరా రాజే ఝల్రాపటన్‌ స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌లాల్‌ను ఓడించారు. 50వేల ఓట్లకు పైగా తేడాతో ఈ విజయం దక్కింది. 
  • ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేశ్ బఘేల్‌ పటాన్‌ స్థానం నుంచి, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ రాజనంద్‌గావ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img