icon icon icon
icon icon icon

Revanth reddy: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

Updated : 03 Dec 2023 21:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. దీంతో 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈమేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ నుంచి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా హాజరయ్యే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉదయం సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశం ఏర్పాటు చేయగా.. గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ సాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img