icon icon icon
icon icon icon

Assembly Election Results: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. సీఎంలు ఏమన్నారంటే?

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వివిధ రాష్ట్రాల సీఎం తమ స్పందించారు. విజేతలకు శుభాకాంక్షలు చెప్పారు. 

Published : 03 Dec 2023 20:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికల (Assembly Elections 2023) ఫలితాల్లో నాలుగు చోట్ల విజేతలెవరో తేలిపోయింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ ఫలితాలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. 

  • రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా 350కిపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. ప్రధాని మోదీపై నమ్మకంతో భాజపాను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. మోదీ నాయకత్వంలో భారత్‌ విశ్వగురుగా అవతరిస్తుంది. కేంద్రంలో ఈ సారి భాజపాకి హ్యాట్రిక్‌ ఖాయం - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 
  • తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన పార్టీలకు శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజల పురోగతి, శ్రేయస్సు, మార్పు అనే నినాదంతో వారి పరిపాలన సాగాలి - తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ 
  • ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే ఉదాహరణ. దేశానికి మోదీ చేసిన సేవలకు నిదర్శనమే మూడు రాష్ట్రాల్లో భాజపా విజయం. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు ఉన్న ప్రేమను ఈ ఫలితాలు ప్రపంచానికి చాటి చెప్పాయి - పుదుచ్చేరి సీఎం రంగస్వామి 
  • ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రతి ఎన్నికల ఫలితాల నుంచి రాజకీయ పార్టీలు పాఠాలు నేర్చుకుంటాయి. ఓటిమికి కుంగిపోవు, విజయానికి ఎగిరిపడవు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణం - కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
  • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కృషి, నాయకత్వంతోనే మూడు రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించింది. మోదీ ప్రతిభ మసకబారిందన్న ప్రతిపక్షాలకు.. ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పారు - మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే
  • ప్రధాని మోదీపై నమ్మకంతో మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపాకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. తెలంగాణలో పార్టీ ఓటమితో కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు - యోగి ఆదిత్యనాథ్‌ 
  • ప్రధాని మోదీ నాయకత్వం అంటేనే అభివృద్ధి, సంతోషం, శాంతి, సామరస్యానికి భరోసా. భాజపా అభివృద్ధి రాజకీయాలపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి నిదర్శనమే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. భాజపా పాలనలో మూడు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా - గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img