icon icon icon
icon icon icon

Telangana New Ministers: తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated : 07 Dec 2023 12:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనునున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నేడు మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

నల్గొండ జిల్లా నుంచి ఊహించిన విధంగానే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, మెదక్‌ జిల్లా నుంచి దామోదర్‌ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంతే స్వయంగా ఫోన్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img