icon icon icon
icon icon icon

Congress: కాసేపట్లో సీఎల్పీ భేటీ.. నేడు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం?

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీ (Congress).. నేడు సీఎం అభ్యర్థిని నిర్ణయించనుంది.

Updated : 04 Dec 2023 12:02 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీ (Congress).. నేడు సీఎం అభ్యర్థిని నిర్ణయించనుంది.  నగరంలోని ఓ హోటల్లో నిర్వహించనున్న ఆ పార్టీ శాసనసభాపక్ష ( సీఎల్పీ) సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. పరిశీలకులు ఎమ్మెల్యేల నుంచి  అభిప్రాయాలను తీసుకోనున్నారు. సీఎల్పీ నేత ఎంపిక పూర్తవగానే నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ను కలవనుంది. సాయంత్రానికి ప్రమాణస్వీకారం ఉండొచ్చని తెలుస్తోంది. 

ఇవాళ సీఎం, ఒకరిద్దరు ఉపముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణస్వీకారానికి వీలుగా రాజ్‌భవన్‌లో ఉన్న సౌకర్యాలపై ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. 300 మంది వరకు పాల్గొనేలా సౌకర్యాలు ఉన్నట్లు నేతలు తెలుసుకున్నారు. ఈ నెల 6 లేదా 9న మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయోత్సవ సభగా నిర్వహించే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక తదితరులు హాజరయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img