బిర్లా టెంపుల్‌లో రేవంత్‌ రెడ్డి పూజలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana elections 2023) కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీ పథకాలకు చట్టబద్ధత తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2023 14:57 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana elections 2023) కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీ పథకాలకు చట్టబద్ధత తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో, పథకాల గ్యారంటీ కార్డును ఉంచి పూజలు చేశారు. అంతకుముందు నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. రేవంత్‌ రెడ్డితోపాటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, మధు యాష్కీ, వి.హనుమంతరావులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామని ప్రమాణం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని