icon icon icon
icon icon icon

TS Exit polls: తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కే.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే!

తెలంగాణలో పోలింగ్‌ ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను వెల్లడించాయి.

Updated : 30 Nov 2023 19:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలింగ్‌ ముగియడంతో వివిధ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని వెల్లడించాయి.

ఆరా ప్రీ పోల్‌ అంచనాలు..

* భారాసకు 41 నుంచి 49, కాంగ్రెస్‌కు 48 నుంచి 67 స్థానాలు,  భాజపా 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.

చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌..

* భారాస 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్‌ 67 నుంచి 78, భాజపా 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 6-7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వెల్లడించింది.

జన్‌కీబాత్‌..

* భారాస 40 నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్‌ 48 నుంచి 64 స్థానాలు, భాజపా 7 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది.

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్‌..

* భారాస 48, కాంగ్రెస్‌ 56, భాజపా 10, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌లో తెలిపింది.

పీపుల్స్‌ పల్స్‌ ..

* కాంగ్రెస్‌ 62 నుంచి 72 స్థానాల్లో, భారాస 35 నుంచి 46 స్థానాల్లో, ఏఐఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో, భాజపా 3 నుంచి 8 స్థానాల్లో, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలుపొందే అవకాశముందని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచానా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img