icon icon icon
icon icon icon

TS Polling: 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌

తెలంగాణ వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 30 Nov 2023 13:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌లో అత్యధికంగా 30.65 శాతం పోలింగ్‌ నమోదైంది.

వివిధ జిల్లాల వారీగా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. 

అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కామారెడ్డి బాలుర పాఠశాల వద్ద భారాస, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికేతరుల వాహనాలు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నాయని భారాస నేతలు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జ్యోతినగర్‌లో ఓటు వేశారు. ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img