icon icon icon
icon icon icon

Uttam Kumar Reddy: సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా నాకు ఓకే: ఉత్తమ్‌

తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం ప్రకటించినా తనకు ఆమోదమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.

Published : 05 Dec 2023 13:04 IST

దిల్లీ: తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం ప్రకటించినా తనకు ఆమోదమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. దిల్లీ వెళ్లిన ఆయన.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

డీకే శివకుమార్‌తో సమావేశం అనంతర ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగానూ గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానన్నారు. అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img