Eatala Rajendar: భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం

భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. ఆయన  ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ స్వల్ప ప్రమాదానికి గురైంది.

Updated : 03 Sep 2023 20:51 IST

కరీంనగర్‌: భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. ఆయన  ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ స్వల్ప ప్రమాదానికి గురైంది. మానకొండూరు మండలం లలితాపూర్‌ వద్ద గొర్రెల మందను చూసి ఈటల ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. వాహనం అకస్మాత్తుగా ఆగడంతో వెనుక వస్తున్న ఎస్కార్ట్‌లోని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఈటల వాహనం స్వల్పంగా దెబ్బతింది. దీంతో ఆయన మరో వాహనంలో హైదరాబాద్‌ వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని