Vizag: విశాఖలో కుంగిన నూతన బస్‌ షెల్టర్‌

విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది. జీవీఎంసీ కార్యాలయం ముందు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.

Updated : 27 Aug 2023 12:53 IST

విశాఖపట్నం (కార్పొరేషన్‌): విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది. జీవీఎంసీ కార్యాలయం ముందు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్‌షెల్టర్‌ను ఐదు రోజుల క్రితం నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన నిర్మాణం.. ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షెల్టర్‌ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగినట్లు సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని