CBI: 25వేల కేజీల డ్రగ్స్‌.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు ముగిశాయి.

Updated : 22 Mar 2024 17:32 IST

మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు ముగిశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు నిర్వహించారు.  ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ బృందం.. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లారు.

బ్రెజిల్‌ నుంచి 25వేల కేజీల మాదకద్రవ్యాల కంటెయినర్‌ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో బుక్‌ అయి విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌పోల్‌ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని