ఓటరు జాబితాలో మీ పేరుందా.?

సాధారణంగా తుది ఓటరు జాబితా ప్రకటించిన తరువాత ఓటర్లు పేర్లు పరిశీలించుకోవడం అవసరం. అయితే.. తీరిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పరిశీలించుకోవడం లేదు.

Updated : 29 Oct 2023 05:46 IST

చరవాణిలో ఓటరు వివరాలు తెలుసుకునే పేజీ

గద్వాల న్యూటౌన్‌, శాంతినగర్‌, అచ్చంపేట, న్యూస్‌టుడే: సాధారణంగా తుది ఓటరు జాబితా ప్రకటించిన తరువాత ఓటర్లు పేర్లు పరిశీలించుకోవడం అవసరం. అయితే.. తీరిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పరిశీలించుకోవడం లేదు. కొన్ని చోట్ల వెళ్లినా జాబితా అందుబాటులో ఉండటం లేదు. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు వెళ్లి, ఓటు లేదని గగ్గోలు పెట్టడం, అధికారులతో వాగ్వాదం చేయడం చూస్తుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే పరిశీలించుకోవడం మంచిది. ఒక వేళ లేకపోతే నమోదుకు నవంబరు 31 వరకు అవకాశం ఉన్నందున, ఓటర్లు వెంటనే జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని అధికారులు చెబుతున్నారు. జాబితా కోసం ఎక్కడికే వెళ్లే పని లేకుండా చేేతిలో ఉన్న చరవాణి ద్వారా పరిశీలించుకోవచ్చు. గూగుల్‌లో electoralsearch.eci.gov.in వెబ్‌ పేజీ ప్రారంభించి, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎంపిక చేసుకొని మీ పేరు లేదా మొబైల్‌ నంబర్‌ లేదా ఓటరు ఎపిక్‌ నంబర్‌ నమోదు చేస్తే మీ పేరు ఉందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకు 5 నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్‌ చేసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని