Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు, సీపీఐ నేత డాక్టర్ సోహన్‌సింగ్ జోషి(80) గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు, సీపీఐ నేత డాక్టర్ సోహన్‌సింగ్ జోషి (80) గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఆదివారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ హోమియో కళాశాలలో చాలాకాలం అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన వామపక్ష ఉద్యమానికి సన్నిహితంగా ఉండేవారని, రామంతాపూర్‌లో హోమియో ఆసుపత్రి, కళాశాలకు రూ.కోట్ల విలువైన భవనాన్ని నిర్మించి ఇచ్చారని సీపీఐ నాయకులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, కె.రామకృష్ణ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
డాక్టర్ సోహన్‌సింగ్‌కు హోమియో వైద్యుడిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ప్రభుత్వ హోమియో కాలేజి ప్రిన్సిపల్‌గా, ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వైద్య వృత్తిని కొనసాగించారు. నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలందించే వారు. సోహన్ సింగ్ అనగానే ఏ పంజాబీయో అనుకుంటారు .. కానీ, ఆయన తెలుగువారే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!