Badrachalam: 12వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాం: మంత్రి పువ్వాడ

గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. శనివారం భద్రాచలం పరిధిలోని ముంపు ప్రాంతాలను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఏరియల్‌ సర్వే చేశారు.

Updated : 29 Jul 2023 19:04 IST

భద్రాచలం: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. శనివారం భద్రాచలం పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఏరియల్‌ సర్వే చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 12వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మంత్రి చెప్పారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి వదర ఉద్ధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. పునరావాస కాలనీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.2 అడుగుల వద్ద కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని