Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వండి: అధికారులకు తుమ్మల ఆదేశాలు

వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమలను సోమవారం నుంచి మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.

Published : 16 Jan 2024 02:24 IST

సిరిసిల్ల: సంక్షోభం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమలను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పరిశ్రమలను మూసివేయడానికి కారణాలు తెలుసుకొని ప్రభుత్వం తరఫున సహాయాన్ని అందించాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చేనేత శాఖ కమిషనర్‌ అలుగు వర్షిణిని ఆదేశించారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని.. అందుకే పెట్టుబడి పెట్టి ఉత్పత్తి కొనసాగించలేకపోతున్నామని పలువురు యజమానులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని