Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు.

Updated : 18 Jul 2023 16:25 IST

కడప (చిన్నచౌక్‌): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని