Rain Alert: తెలంగాణలో రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో రెండు రోజులపాటు అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated : 25 Jun 2023 16:06 IST

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఆసిఫాబాద్, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దగ్గరలోని ఆవర్తనం ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని పేర్కొంది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మూసాపేట్‌, బాచుపల్లి, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్‌నగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, మల్కాజ్‌గిరి, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని