Girlfriend effect: కొత్త ట్రెండ్‌.. #గర్ల్‌ఫ్రెండ్‌ ఎఫెక్ట్‌.. ఇంతకీ ఏమిటిది?

Girlfriend effect Trend: టిక్‌టాక్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ ఎఫెక్ట్‌ పేరిట కొత్త ట్రెండ్‌ ఒకటి మొదలైంది. ప్రస్తుతం ఇది ఎక్స్‌ వరకు పాకింది. దీంతో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ట్రెండ్‌?

Updated : 29 Sep 2023 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎప్పుడేది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. పదేళ్ల ఛాలెంజ్‌ అని ఒకరు మొదలు పెడితే.. ‘కీకీ’ ఛాలెంజ్‌ అంటూ వెంటనే మరోటి వస్తుంది. ఇంకో ట్రెండ్‌ మొదలయ్యే వరకు అది కొనసాగుతుంది. తాజాగా ‘గర్ల్‌ఫ్రెండ్‌ ఎఫెక్ట్‌’ (girlfriend effect) అనే కొత్త ట్రెండ్‌ మొదలైంది. టిక్‌టాక్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఎక్స్‌ (ట్విటర్‌)కూ పాకింది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్‌?

గర్ల్‌ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత బాయ్‌ ఫ్రెండ్‌లో ఎలాంటి మార్పులొచ్చాయో తెలియజేయడమే ఈ ట్రెండ్‌. పరిచయం కాక ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత ఎలా ఉన్నాడో పేర్కొంటూ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం దీని ఉద్దేశం. అంటే రిలేషన్‌ షిప్‌ వల్ల బాయ్‌ ఫ్రెండ్‌లో ఎలాంటి పాజిటివ్‌ మార్పులొచ్చాయో చెప్పడమన్నమాట. లుక్‌, స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్సింగ్‌లో వైరుధ్యాన్ని చూపిస్తూ పలువురు పోస్టులు చేస్తున్నారు. 

‘రాజారాణి’ టు ‘జవాన్‌’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్‌

బాయ్‌ ఫ్రెండ్‌ ఎయిర్‌ పేరిట ఆ మధ్య కొద్ది రోజులు ఓ ట్రెండ్‌ చక్కర్లు కొట్టింది. బాయ్‌ ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలా కళావిహీనంగా తయారవుతారో పేర్కొనడం అప్పటి ట్రెండ్‌ ఉద్దేశం. గర్ల్‌ ఫ్రెండ్‌ ఎఫెక్ట్‌ వల్ల బాయ్‌ ఫ్రెండ్‌లో ఎలాంటి మార్పులొస్తాయనేది తాజా ట్రెండ్‌ ఉద్దేశం. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఈ ట్రెండ్‌ 58 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. కొందరు ఈ కొత్త ట్రెండ్‌ను అందిపుచ్చుకుని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల కళా విహీనం అవ్వడమేంటో.. గర్ల్‌ఫ్రెండ్‌ సావాసం వల్ల అందంగా మారడమేంటో అర్థం కావడం లేదు’ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ‘ఆఁ ఎవరు ఏమైపోతే మాకేంటి!’ అంటూ సింగిల్స్‌గా ఉన్న నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని