Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 Jun 2024 09:00 IST

1. శిఖరమై నిలిచావు.. సెలవంటూ వెళ్లావు

అక్షరం అంజలి ఘటించింది.. నిత్యకృషీవలుడు ఇక లేరని ‘ఈనాడు’ కన్ను చెమర్చింది.. అరవై ఏళ్ల అశిధార వ్రతం ముగిసింది తెలుగు తల్లి ఒడి కన్నీటి సంద్రమైంది.. సినీ కళామతల్లి తల్లడిల్లింది.. అన్నదాత హలం కదలనంది. ఆపన్నుల అండ.. నింగికెగసింది అవిశ్రాంత యోధుడి అంతిమయాత్రను చూసి చిత్రనగరి గుండె చెరువైంది. పూర్తి కథనం

2. ఈ బడిలో చేరాలంటే.. వరుస కట్టాల్సిందే!

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఒకింత ఆలోచిస్తారు. చదువులో వెనుకబడతారని సంశయిస్తుంటారు. పిల్లలు వెళ్లబోమని మారాం చేస్తుంటారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల సొంతం. ఇక్కడ చదివేందుకు వివిధ ప్రాంతాల విద్యార్థులు ఏటా పోటీ పడుతుంటారు.పూర్తి కథనం

3. గురివెంద నీతి.. గుంజుడే రీతి..!

రాష్ట్రంలో అరాచక వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడంతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)లో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యానికి చెక్‌ పడింది. గతంలో చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంతో ఏర్పడిన సీఆర్డీఏను వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతూ.. వారు చెప్పినట్లే నడుచుకుంటూ రాజధానిని నిర్వీర్యం చేశారు. పూర్తి కథనం

4. డిగ్రీలోనూ కంప్యూటర్సే!

ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇతర కోర్సులను మూసివేసుకొని సీఎస్‌ఈ సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకున్నాయి. ఇప్పుడు అదే దిశగా డిగ్రీ విద్య వడివడిగా అడుగులు వేస్తోంది. డిమాండ్‌ లేని కోర్సులకు టాటా చెప్పి...విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కోర్సులు కావాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయి.పూర్తి కథనం

5. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది

తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు.పూర్తి కథనం

6. తిప్పికొట్టారు..!

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వైకాపా సీనియర్‌ నేతలు ఘోరమైన ఓటమి చవిచూశారు. వారి స్వగ్రామాల్లోనూ ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఓటు వేసిన పోలింగ్‌ బూత్‌లోనూ వెనకబడ్డారు. కొందరికి గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యత కంటే భారీగా తగ్గిపోయింది. పూర్తి కథనం

7. చెంచిరెడ్డీ.. నువ్వెంత నీ బతుకెంత

‘నువ్వెంత... నీ బతుకెంత. ఒంట్లో ఎక్కడ చూసినా యాభై గ్రాముల కండ లేదు. నువ్వు అందరినీ బెదిరిస్తావా. మా ఊళ్లపై అసలు నీ పెత్తనమేంటి! ఎమ్మెల్యే చేతకాని వాడు. అందుకే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. ఇంకోసారి మా జోలికొస్తే.. మా ఊళ్లపై పెత్తనం చేస్తానంటే నీ సంగతి తేలుస్తా’... వైకాపా సంతనూతలపాడు మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డికి ఓ వ్యక్తి చేసిన హెచ్చరిక ఇది. ఒంగోలు నగరం పేర్నమిట్టకు చెందిన దళిత సామాజిక కార్యకర్త కొరిశపాటి వెంకట్రావు మాట్లాడిన ఆడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.పూర్తి కథనం

8. సహాయ మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్సీపీ

స్వతంత్ర హోదాతో భాజపా ఇస్తామని చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలోనే తాను కేబినెట్‌ మంత్రిగా పనిచేశాననీ, ఇప్పుడు సహాయ మంత్రి అంటే తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుందన్నారు. పూర్తి కథనం

9. తూచ్‌.. మోదీ తొండాట.. నేను గుండు కొట్టించుకోను

‘‘మోదీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకొంటా’’ అంటూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన  ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి.. తన మాట ప్రకారం గుండు కొట్టించుకునేందుకు ఆదివారం ససేమిరా అన్నారు. మోదీ మూడోసారి సొంతబలంపై ప్రధాని కాలేదని, మిత్రపక్షాల ఊతంతోనే మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారని వాదించారు.పూర్తి కథనం

10. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు అన్నీ తానై వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి, బిజు జనతా దళ్‌ పార్టీ నాయకుడు వి.కార్తికేయ పాండ్యన్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని