Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Mar 2024 09:00 IST

1. చిందులేస్తాం.. నిబంధనలు తుంగలో తొక్కేస్తాం

వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా ఓడీసీ మండలం టీ.కుంట్లపల్లి, చెర్లోపల్లిలో జరిగిన ప్రచారంలో వాలంటీర్లు మంజుల, అనిల్‌కుమార్‌ వైకాపా కండువాలు వేసుకుని చిందులు వేశారు. పూర్తి కథనం

2. బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు?

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చాల్చి వచ్చిందని నేషనల్‌ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకొన్న ఇంజినీర్లను ప్రశ్నించింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కమిటీ మూడు రోజుల పాటు (శుక్రవారం వరకు) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, ఇన్వెస్టిగేషన్‌, డిజైన్స్‌ నిపుణులు, వివిధ పరీక్షలు చేసిన సంస్థలు, గుత్తేదారులను విచారించనుంది.పూర్తి కథనం

3. బటన్‌ నొక్కారు సరే.. నగదు ఎక్కడా..?

పేరుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అన్నదాతలకు మాత్రం సున్నా వడ్డీ జమ కాలేదు. వాస్తవానికి సున్నా వడ్డీ కింద జిల్లాలో మొత్తం రూ.7.5 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఫిబ్రవరి 28న జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు..పూర్తి కథనం

4. డ్రోన్‌ దీదీ.. సాధికారత వారధి

స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వారు ఆర్థికంగా పరిపుష్టి సాధించడంతోపాటు మరికొందరికి ఉపాధినిచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకంలో భాగంగా పదో తరగతి పూర్తి చేసిన మహిళా సంఘం సభ్యులు కొందరిని డ్రోన్‌ నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణకు ఎంపిక చేసి హైదరాబాద్‌ శివారులో ఇటీవల పది రోజుల పాటు తర్ఫీదు ఇచ్చింది. పూర్తి కథనం

5. సంస్కారహీనులే వైకాపాలో ఉండగలరు: కొలుసు పార్థసారథి

వైకాపా ప్రభుత్వం రాజధాని అంశాన్ని నవ్వులాట తంతుగా మార్చేసిందని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, నూజివీడు తెదేపా అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. తనతో సహా సామాన్యుల వరకు ఎవరు రాజధాని గురించి ప్రశ్నించినా.. నీకేంటయ్యా.. రాజధానితో పని అంటూ వైకాపా పెద్దలు నోరు మూయించేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి కథనం

6. ప్రజాపాలన దరఖాస్తులతో దోపిడీ

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.పూర్తి కథనం

7. కబ్జాల బండికి అక్రమాలే ఇరుసు!

విజయనగరం జిల్లాలోని ఓ కోటలాంటి ప్రాంతానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. అధికారం చేపట్టింది మొదలు... అడ్డగోలు దోపిడీతో పేట్రేగిపోతున్నారు. ఆయన కన్ను పడితే... ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ఏదైనా కబ్జా కావాల్సిందే. ఖాళీ జాగాలైనా, వివాదాస్పద భూములైనా ఆయన పరం అవ్వాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా... ఆయనకు ముడుపు చెల్లించుకోవాల్సిందే.పూర్తి కథనం

8. ఎన్ని‘కుల’ జగన్నాటకం

ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. అలా ఇతరచోట్లకు మళ్లించడం ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్‌ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూర్తి కథనం

9. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి

అకాల వర్షాలు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు.పూర్తి కథనం

10. పురాలకు వరం

రాష్ట్రంలోని 98 పురపాలక సంఘాల్లో తాగునీటి వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు మార్గం సుగమమైంది. తొమ్మిది పురపాలికల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. అమృత్‌-2 పథకం కింద ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చనున్నాయి. తాగునీటి వ్యవస్థ పటిష్ఠానికి రూ.3,430 కోట్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం రూ.1,956 కోట్లు ఖర్చు చేయనున్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని