logo

Anantapur: చిందులేస్తాం.. నిబంధనలు తుంగలో తొక్కేస్తాం

వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 21 Mar 2024 05:39 IST

వైకాపా ప్రచారంలో యథేచ్ఛగా పాల్గొంటున్న వాలంటీర్లు

ఓడీసీ మండలం చెర్లోపల్లిలో ప్రచారంలో చిందులేస్తున్న అనిల్‌కుమార్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా ఓడీసీ మండలం టీ.కుంట్లపల్లి, చెర్లోపల్లిలో జరిగిన ప్రచారంలో వాలంటీర్లు మంజుల, అనిల్‌కుమార్‌ వైకాపా కండువాలు వేసుకుని చిందులు వేశారు.

ప్రభుత్వ చౌకధరల దుకాణం డీలరు మండ్లి ప్రభావతి

కొత్తచెరువు: కొత్తచెరువు బీసీకాలనీలో శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లతోపాటు డీలర్లు, వైన్‌షాప్‌ సేల్స్‌మెన్‌ పాల్గొన్నారు. చౌకదుకాణం డీలరు మండ్లి ప్రభావతి, ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న సుదర్శన్‌బాబు, గ్రామ సచివాలయం-1, 4 వాలంటీర్లు అర్షద్‌, సాయిప్రకాశ్‌లు ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే బీసీ కాలనీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా.. డీజే శబ్దాలు తగ్గించకుండానే ప్రచారం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడటంతో స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. కోడ్‌ అమలులోకి వచ్చి ఐదు రోజులు అవుతున్నా ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

వాలంటీరు సాయిప్రకాశ్‌

వాలంటీర్లు, ఉపాధి క్షేత్ర సహాయకుడికి తాఖీదులు

పుట్టపర్తి: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో భాగ్యరేఖ హెచ్చరించారు. ‘వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఉద్యోగులు, సిబ్బంది, వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ మద్యం దుకాణం సేల్స్‌మన్‌ సుదర్శన్‌బాబు

వాలంటీరు అర్షద్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని