Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 May 2024 09:11 IST

1. ఫలితం ముందే ‘వెల’విల.. తామొగ్గలేమని తేల్చిచెబుతున్న వైకాపా శ్రేణులు

సంక్రాంతి వేళ కోడిపందేల బరులు.. జోరుగా పందేలు సుపరిచితమే. బలిష్టమైన కోడి ఉంటే.. ఒకటికి రెండు రెట్లు పందెం కాస్తుంటారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఒకటికి రెండని పందెంరాయుళ్లు తిరుగుతున్నారు. ఆకర్షణీయ పందెం ఆఫర్‌ చేస్తున్నా.. వైకాపా వారు ముందుకు రావడం లేదు. పూర్తి కథనం

2. బంగారు బిస్కెట్‌ కావాలా నాయనా!

తక్కువ ధరకు పసిడి ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.4కోట్లు కాజేశారు మాయగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  రామంతాపూర్‌కు చెందిన విశాల్, వినయ్, అఖిల్‌ తేలికగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. గొలుసుకట్టు తరహాలో తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు అంటూ ప్రచారం చేశారు.తక్కువ ధరకు పసిడి ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.4కోట్లు కాజేశారు మాయగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.పూర్తి కథనం

3. నాడి పట్టేవారి జాడ కనిపెట్టాలి..

గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో సగటున రోజుకు 2 వేల మంది వరకు ఔట్‌ పేషెంట్లు (ఓపీ) వస్తారు. మరో 1500 మందికి పైగా ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటారు. ఇన్ని వేల మంది ఉండే ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, పారా మెడికల్‌ ఉద్యోగులు, నాలుగో తరగతి సిబ్బంది ఉన్నా సేవలు లోపిస్తున్నాయి.పూర్తి కథనం

4. ‘కేసీఆర్‌ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం’

కేసీఆర్‌ కుటుంబమంతా ఒక దొంగల ముఠా అని, జూన్‌ 4 తర్వాత అందరూ చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమని పట్టుభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు. శుక్రవారం హనుమకొండ కాంగ్రెస్‌ భవన్‌లో పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, యువజనులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.పూర్తి కథనం

5. కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్‌ అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై వైకాపా మూకలు మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డాయి.పూర్తి కథనం

6. ఎవరి వ్యూహం వారిదే

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్‌ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోలింగ్‌ ముగిసే 48 గంటల ముందు అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాస, భాజపా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని వివిధ మార్గాల్లో ప్రచారం చేయడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.పూర్తి కథనం

7. చెప్పేవన్నీ వట్టిమాటలే!

పాఠశాల విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల సంఖ్య ఏటా పెరుగుతోందని వైకాపా సర్కారు చెబుతూ వచ్చింది. ఆ మాటలన్నీ వట్టివేనని తేలింది. నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు విద్యా కానుక పథకం కింద వస్తువులు సరఫరా చేయాల్సి ఉంటుంది. పూర్తి కథనం

8. చదివేది ఒకటి.. చెప్పాల్సింది మరొకటి

పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును, పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను తెచ్చారు.. కానీ, వీటిని బోధించే వారిని తయారు చేసే బీఈడీ, డీఈడీ సిలబస్‌లను మాత్రం ప్రభుత్వం మార్పు చేయలేదు. వీరికి రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగానే కోర్సును అందిస్తున్నారు. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సిలబస్, మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా బీఈడీ, డీఈడీ పాఠ్యప్రణాళికను మార్చకపోవడంతో ఉపాధ్యాయ విద్య చదివినా బోధన నైపుణ్యాలపై వారికి అవగాహన ఉండటం లేదు.పూర్తి కథనం

9. శిఖం భూమిలో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చివేత

మాజీ మంత్రి, మేడ్చల్‌ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కొనుగోలు చేసిన ఓ భూమికి సంబంధించిన ప్రహరీని శామీర్‌పేట మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖల అధికారులు శుక్రవారం కూల్చివేశారు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామ చెరువు శిఖం, బఫర్‌ జోన్‌లోని సర్వే నంబరు 408లో మల్లారెడ్డి దాదాపు రెండేళ్ల క్రితం 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.పూర్తి కథనం

10. బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని