Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jun 2024 21:40 IST

1.నా హృదయం ఉప్పొంగుతోంది: పవన్‌ విజయంపై చిరంజీవి ఆనందం

తన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంపై ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు. మరోవైపు, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు చిరు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి కథనం

2. రికార్డులను తిరగరాస్తూ.. నారా లోకేశ్‌ భారీ విజయం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భారీ విజయం సాధించారు. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నారా లోకేశ్‌ నిలబెట్టుకున్నారు. గతంలో తెదేపా గెలవని మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి మరీ విజయం సాధించారు. 39 ఏళ్ల తర్వాత అక్కడ పసుపు జెండాను ఎగురవేశారు. 1985లో తెదేపా తరఫున కోటేశ్వరరావు గెలిచారు. పూర్తి కథనం

3. పవన్‌ కల్యాణ్‌ విజయంపై రేణూ దేశాయ్‌ పోస్ట్‌..

ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే కూటమికి చెందిన పలువురు ప్రముఖులు విజయకేతనం ఎగురవేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. పూర్తి కథనం

4. బూతుల నేతలకు ఓటర్ల చెంపదెబ్బలు

ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విస్పష్ట తీర్పుతో వైకాపా(YSRCP)కు చుక్కలు కనిపించాయి. ఫలితాల్లో ఆ పార్టీ కనీస స్థాయిలో ప్రభావం చూపలేక సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఇంతటి ఘోర పరాభవానికి కారణాలు లెక్కలేనన్ని. అయితే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతలు వాడిన భాష. పూర్తి కథనం

5. వైకాపా గెలిచిన 11 అసెంబ్లీ స్థానాలు ఇవే..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైకాపా కేబినెట్‌లోని మంత్రలంతా ఓటమి పాలయ్యారు. పూర్తి కథనం

6. బెంగాల్‌లో బెనర్జీ దూకుడు.. చతికిలపడ్డ భాజపా

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. అయితే, ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడును ఏమాత్రం అడ్డుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. క్రితం లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించిన భాజపా.. ఈసారి 10 సీట్లకే పరిమితమైపోతున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. పూర్తి కథనం

7. వార్‌ వన్‌ సైడ్‌.. వైకాపాకు దక్కని ప్రతిపక్ష హోదా

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు సాగించిన అరాచక పాలనకు వైకాపా (YSRCP) మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ దారుణ ఓటమి మూటగట్టుకుంది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ తెదేపా నేతృత్వంలోని కూటమికి కనీస స్థాయి పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం గమనార్హం.  పూర్తి కథనం

8. ఏపీ ఎన్నికల ఫలితాలు.. తెదేపాలో హ్యాట్రిక్‌ వీరులు వీళ్లే..

ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. 175లో ఏకంగా 166 చోట్ల విజయదుందుభి మోగించింది. మరోవైపు తెదేపా సొంతంగానే 130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. పూర్తి కథనం

9. లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని భారాస

లోక్‌సభ ఎన్నికల్లో భారాస దారుణ పరాజయాన్ని చవిచూసింది. పార్టీ చరిత్రలోనే.. తొలిసారిగా ఒక్కస్థానం గెల్చుకోకుండా సంపూర్ణ ఓటమిని మూటగట్టుకొంది. పూర్తి కథనం

10. పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌ తేజ్‌.. వీడియో వైరల్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎన్నికల్లో విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కొందరు నేరుగా, మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్‌ మంగళగిరి వెళ్లారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని