Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 Apr 2023 17:12 IST

1. ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, ప్రకాశ్‌ అంబేడ్కర్‌

నగరం నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ  కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ  గురువులు ప్రార్థనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే.. కేంద్రం క్లారిటీ

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag steel plant) ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం: చంద్రబాబు

రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు ఎన్టీఆరేనని చెప్పారు. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంబేడ్కర్‌ లేకపోతే తెలంగాణ లేదు: మంత్రి కేటీఆర్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఆయన విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత.. భారీగా పోలీసు బందోబస్తు

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో కొంత మేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు.. కంచె నిర్మాణం చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేస్తున్నారు. ఆర్డీవో భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉమేశ్‌ పాల్‌ హత్యకు ఫిబ్రవరి 11న జైల్లోనే కుట్ర..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేశ్‌పాల్‌ హత్యకు ఫిబ్రవరిలో అసద్‌ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అదే రోజు అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmad)కు 2006లో ఉమేశ్‌పాల్‌ కిడ్నాప్‌ కేసులో శిక్షపడింది. ఈ నేపథ్యంలో తన తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు ఉమేశ్‌ హత్యకు పథకం పన్నినట్లు తేలింది. ఇందుకోసం అసద్‌ సహా ఎనిమిది మంది బరేలీ జైల్లో ఉన్న అతీక్‌ (Atiq Ahmad) సోదరుడు ఖలీద్‌ ఆజమ్‌ను కలుసుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేనే ముగించాల్సింది.. కానీ తెవాతియాకు పంజాబ్‌తో ఓ లవ్‌స్టోరీ ఉంది: గిల్

ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌లో ఇటీవల ప్రతి మ్యాచ్‌.. చివరి ఓవర్‌ వరకూ వెళ్తూ ఉత్కంఠను పెంచుతోంది. అందరినీ మునివేళ్లపై నిలబెట్టి.. చివరి బంతికి విజయం తేలుతోంది. గురువారం గుజరాత్‌, పంజాబ్‌(GT vs PKS)ల మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘వందే మెట్రో’.. డిసెంబరు నుంచి రయ్‌ రయ్‌..

దేశ ప్రజలకు అత్యాధునిక వసతులతో వేగవంతమైన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)’ పేరుతో కేంద్ర ప్రభుత్వం సెమీ హైస్పీడ్‌ రైళ్లను తీసుకొచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పెద్ద నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ మినీ వెర్షన్‌లో ‘వందే మెట్రో (Vande Metro)’లను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కర్ణాటకలో ‘అమూల్‌’ మంటలు.. కేరళలో ‘నందిని’పై రగడ!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అమూల్‌ (Amul) ప్రవేశం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రానికీ ఈ మంటలు వ్యాపించాయి. నందిని (Nandini) బ్రాండ్‌కు పోటీగా అమూల్‌ ప్రవేశాన్ని కర్ణాటకలో విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. ఇదే నందిని సంస్థ తమ రాష్ట్రంలో స్టోర్లు తెరవడంపై కేరళకు చెందిన పాల సహకార సంస్థ మిల్మా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐర్లాండ్‌ పర్యటనలో నోరుజారి గందరగోళం సృష్టించిన బైడెన్‌..!

అమెరికా (USA) అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) కొన్నేళ్లుగా మాటలపై నియంత్రణ కోల్పోయి గందరగోళ పరిస్థితులను సృష్టించడం సాధారణమైపోయింది. తాజాగా ఐర్లాండ్‌ (Ireland) పర్యటనలో తొలి రోజే ఇటువంటి ఘటనే చోటు చేసుకొంది. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌కు చెందిన రగ్బీ బృందం.. 1920లో ఐరిష్‌ ప్రజలపై అరాచకాలకు పాల్పడిన బ్రిటిష్‌ పోలీసులకు మధ్య తేడాను మర్చిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని