Vizag steel plant: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే.. కేంద్రం క్లారిటీ

Ministry of Steel on RINL: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడం లేదని స్పష్టంచేసింది. మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని పేర్కొంది. 

Updated : 14 Apr 2023 18:32 IST

దిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag steel plant) ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

ఇప్పటికిప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేయాలని కేంద్రం అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ గురువారం చేసిన వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యం. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంటు పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత కార్మికులు, తదితరులతో జరిగిన భేటీల్లో ఆయన ఈ విషయంపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రకరకాల చర్చలకు తెరలేచింది. మంత్రి ప్రకటనతో ప్రైవేటీకరణ ఉంటుందా? ఉండదా? అనేదానిపై స్పష్టత కొరవడింది. ఈ క్రమంలోనే ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం తాజాగా స్పష్టతనిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని