Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jul 2023 13:17 IST

1. రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమా మరింత ప్రత్యేకం. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో వచ్చిన ‘వినోదయసిత్తం’ తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు అదే సినిమాను పవన్‌ కీలక పాత్రలో ‘బ్రో’(BRO Movie) మూవీగా రీమేక్‌ చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బలవంతంగా రాజీనామా చేయించారు.. కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్‌ ఉద్యోగి

ఈడీ దాడులు (ED Raids), లేఆఫ్‌ (Layoffs) సమస్యలతో కొన్ని నెలలుగా సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ (EdTech) కంపెనీ బైజూస్‌ (Byjus) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీలో లేఆఫ్‌కు గురైన ఓ ఉద్యోగి బైజూస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగులు, కస్టమర్లను కంపెనీ మోసగిస్తోందని ఆరోపించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని..తనకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డ్రోన్లతో భారత్‌లోకి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నిజమే.. అంగీకరించిన పాక్‌ అధికారి

భారత్‌ (India)పై దాయాది పాకిస్థాన్‌ (Pakistan) దుర్బుద్ధి ఆధారాలతో సహా బయటపడింది. పాక్‌ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మాదకద్రవ్యాల (Drugs)ను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పాక్‌ అధికారి ఒకరు బట్టబయలు చేశారు. భారత్‌కు తాము డ్రోన్ల (Drones)తో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ (Smuggling) చేస్తున్నది నిజమేనని స్వయంగా ప్రధాని సలహాదారే కెమెరా ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ+ హాట్‌స్టార్.. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు?

ఓటీటీ (OTT) మాధ్యమాలు వరుసగా యూజర్లకు షాక్‌ ఇస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పాస్‌వర్డ్ షేరింగ్‌ను నెట్‌ఫ్లిక్‌ (Netflix) నిలిపివేసింది. ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) సైతం ఇదే నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ త్వరలోనే కొత్త పాలసీని ప్రవేశపెట్టనుందని కొన్ని ఆంగ్ల కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం.. ప్రీమియం యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్‌ను కేవలం నాలుగు డివైజ్‌లకు మాత్రమే పరిమితం చేయనుందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 11 మంది చిల్లర పోగేసి రూ.250 లాటరీ కట్టి.. రూ.10కోట్ల జాక్‌పాట్‌

అదృష్టం (Luck) ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్‌ కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు..! అది ఈ మహిళల విషయంలో నిజమైంది. కనీసం ఒక్కొక్కరి చేతిలో రూ.25 లేని 11 మంది మహిళలు తమ దగ్గరున్న చిల్లరంతా జమచేసి రూ.250తో లాటరీ (lottery) టికెట్‌ కొన్నారు. అదృష్టం కలిసిరావడంతో వీరి టికెట్‌కే లాటరీ తగిలి ఏకంగా రూ.10 కోట్ల జాక్‌పాట్‌ (Jackpot) కొట్టేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇదేం వాతావరణం.. లక్ష సంవత్సరాల్లో ఇంత వేడి లేదు..!

ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు.. రికార్డులను బద్దలు కొడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జులై చరిత్రకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

గద్వాల పట్టణంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక భీంనగర్‌ కాలనీలో నివాసముంటున్న జయలక్ష్మి(40) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఉదయం ఆమె ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో యాక్సిస్‌ కోత.. ‘అమృత్‌ కలశ్‌’కు లాస్ట్‌ ఛాన్స్‌.. ఆగస్టులో రానున్న మార్పులివే

గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గానూ ఐటీ రిటర్ను దాఖలు చేయాల్సిన గడువు జులై 31తో ముగియనుంది. ఆగస్టు 1 నుంచి రిటర్నులు ఫైలింగ్‌ చేసే వారిపై పెనాల్టీలు పడనున్నాయి. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్‌ 234F ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే వారికి గరిష్ఠంగా రూ.1,000,  రూ.5 లక్షలు దాటిన వారికి గరిష్ఠంగా రూ.5,000 వరకు జరిమానా పడనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మున్నేరు వరద ఉద్ధృతి.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు

కృష్ణా జిల్లా ఐతవరం వద్ద విజయవాడ-హైదరాబాద్‌ హైవే వద్ద మున్నేరు వరదలో విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసులు వారిని క్రేన్‌ సహాయంతో అవతలి ఒడ్డుకు చేర్చి పరీక్ష కేంద్రానికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాలలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష రాసేందుకు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల నుంచి నందిగామకు కొందరు విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో ఐతవరం వరకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వరదలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

ములుగు జిల్లాలో వరదల్లో గల్లంతైన వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్న వాగులో గురువారం ఎనిమిది మంది గల్లంతయ్యారు. తాజాగా తాడ్వాయి మండలం మేడారం వద్ద వరదలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని