Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Aug 2023 13:17 IST

1. ఆలయంపై పడిన కొండచరియలు: 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!

భారీ వర్షాల (Heavy Rains)తో హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల విపత్కర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శిమ్లా (Shimla)లోని ఓ ఆలయం (Temple)పై కొండచరియలు (Landslides) విరిగిపడి 9 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మస్క్‌ లైట్‌ తీసుకున్నాడు..: జుకర్‌ బర్గ్‌ అసహనం

టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌(Elon Musk).. జుకర్‌ బర్గ్‌ ( Mark Zuckerberg) మధ్య ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం మొదలైంది. మస్క్‌ తనతో కేజ్‌ఫైట్‌కు డేట్లు ఇవ్వడంలేదని జుకర్‌ బర్గ్‌ ఆరోపిస్తుండగా..  అతడి ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు తాను వేచి ఉండలేనని మస్క్‌ అంటున్నారు. టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ తనతో ‘కేజ్‌ఫైట్‌’ తేలిగ్గా తీసుకున్నారని.. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని మెటా బాస్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అయ్యోపాపం.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం

ఆ అన్నదమ్ముల ఎదుగుదలను చూసి విధికి కన్నుకుట్టిందేమో! రోడ్డు ప్రమాదం ఇద్దరినీ బలిగొంది. కష్టపడి చదివి జీవితాల్లో స్థిరపడిన సోదరులను ఒక్కసారిగా ఈలోకం నుంచి దూరం చేసి కన్నవారికి పుత్రశోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన కుమారులిద్దరూ ఊహించని ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేస్తే...! సంజయ్‌ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్(Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి(Varanasi) స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐఫోన్‌ చోరీ కోసం నడిరోడ్డుపై టీచర్‌ను ఈడ్చుకెళ్లి.. బైకర్ల దుశ్చర్య

ఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు బైకర్లు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దాని కోసం ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దిల్లీ(Delhi)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు యొవికా చౌదరీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అలిపిరి కాలినడక పరిసరాల్లో మరో 5 చిరుతల సంచారం

 తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నాయి. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈమేరకు ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే), అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికంటే..?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 954 మందికి పోలీసు పతకాల (Police Medals)ను అందజేయనుంది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకాలను ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన డిఫెన్స్‌ కాలేజీ

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు (Heavy Rains) మరోసారి ముంచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో బియాస్‌ నది మళ్లీ ఉప్పొంగగా.. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్నారని భార్యను చంపిన భర్త..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడు ఓ భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారవేత్త (37)కు 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. అయితే.. తన భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటం.. అందులో తనను బ్లాక్‌చేయడంతో భర్తకు కోపం వచ్చింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని