Priyanka Gandhi: వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేస్తే...! సంజయ్‌ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) పోటీ చేస్తారో లేదో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఈ సమయంలో శివసేన(యూబీటీ) నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Updated : 14 Aug 2023 10:40 IST

ముంబయి: శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్(Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి(Varanasi) స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

‘వారణాసి ప్రజలు ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi)ని కోరుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె వారణాసి నుంచి ప్రధాని మోదీకి పోటీగా బరిలో దిగితే తప్పక విజయం సాధిస్తారు. రాయబరేలీ, వారణాసి, అమేఠీలో భాజపాకు గట్టిపోటీ ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రియాంక పోటీపై రెండురోజుల క్రితం ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఆమె పార్లమెంట్‌(Parliament)లో అడుగుపెడుతుందని నేను భావిస్తున్నాను. అందుకు ఆమెకు అన్ని అర్హతలున్నాయి. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రణాళిక రచిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు. 

‘నిన్ను మోసం చేసినవాడు.. రాష్ట్రాన్ని మోసం చేయరా అమ్మా?’

ఇదిలా ఉంటే.. ఎన్‌సీపీ(NCP) అధినేత శరద్‌ పవార్( Sharad Pawar), తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌(Ajit Pawar) మధ్య జరిగిన భేటీ గురించి అడిగిన ప్రశ్నకు సంజయ్‌ రౌత్‌ బదులిచ్చారు. ప్రధాని మోదీ.. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకోగాలేనిది.. వారిద్దరు ఎందుకు కలుసుకోకూడదని ప్రశ్నించారు.  అజిత్‌- శరద్‌పవార్‌ భేటీకి అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని రౌత్‌ తెలిపారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశానికి అజిత్‌ను ఆహ్వానించి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఎవరూ సంతృప్తిగా లేరని రౌత్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని