Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Aug 2023 13:27 IST

1. బిల్‌గేట్స్‌ చేతిలో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో.. ఎందుకో తెలుసా?

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ (Bill Gates) ఇటీవల సొంతంగా ఓ పాడ్‌కాస్ట్‌ (podcast)ను ప్రారంభించారు. ‘అన్‌కన్‌ఫ్యూజ్‌ మి విత్‌ బిల్‌ గేట్స్‌’ పేరుతో పలువురు ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌ రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ ఎన్జీవో సంస్థ ఖాన్‌ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్‌ ఖాన్‌ (Sal Khan)తో ఆయన ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇక జాబిల్లిపై అడుగే తరువాయి

జాబిల్లి (Moon)పై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అనంతగిరిలో పందేల అలజడి

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండలు ఆహ్లాదకర వాతావరణానికి, ఆధ్యాత్మికతకు నిలయం. అలాంటిది మంగళవారం నగరం నుంచి వచ్చిన కొందరు యువకులు  కార్లు, బైక్‌ పందాలతో అలజడి సృష్టించారు. అధికారులు స్వాతంత్య్ర దినోత్సవంలో మునిగి ఉండగా, ఇదే అదునుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర బైక్‌, కారు పందాలు (రేసులు) పెట్టుకొని స్థానికులను, సందర్శకులు భయభ్రాంతులకు గురిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్‌ తగ్గిందా? ఇది కారణం కావొచ్చు..!

బ్యాంకులు కొంత లిమిట్‌తో క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తాయి. కార్డు తీసుకున్న వ్యక్తి ఆదాయం, సకాలంలో చెల్లింపులు చేయడం వంటివి ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్‌ను బ్యాంకులు ఎప్పటికప్పుడు పెంచుతుంటాయి. అయితే కేవలం క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచడమే కాదు.. అప్పుడప్పుడూ తగ్గిస్తుంటాయి కూడా.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చికెన్ కూరలో ఎలుక.. రెస్టారెంట్ సమాధానమిదే..!

తాము ఆర్డర్‌ చేసిన చికెన్ కూరలో ఎలుక అవశేషాలు కనిపించాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. హోటల్ యజమానులు మాత్రం ఆరోణలన్నీ అవాస్తవమంటూ తోసిపుచ్చారు. ముంబయిలోని బాంద్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయి(Mumbai)లోని బాంద్రా పోలీసు స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదు ప్రకారం.. వారు ఆదివారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌(Bandra Eatery)లో చికెన్ కూర, మటన్ థాలీని ఆర్డర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికా సైనికుడే విరక్తితో మా శరణుకోరి వచ్చాడు..: ఉత్తరకొరియా

తినడానికి సరైన తిండి దొరకదు.. కదిలితే ఆంక్షలు.. ఇక ఆధునిక టెక్నాలజీ వినియోగం ఎక్కడా కనిపించదు.. ఇది ఉత్తరకొరియా పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలే వీలు దొరికినప్పుడల్లా కంచెలు దాటి ఇతర దేశాల్లో ప్రవేశించి శరణు కోరతారు. కానీ, తాజాగా ఉత్తరకొరియాకే ఓ అమెరికా (USA) సైనికుడు శరణార్థిగా వెళ్లాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీకాళహస్తికి ‘కొట్టు’ వచ్చారని కొట్లు మూయించారు!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Sathyanarayana) పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి వస్తున్నారని దుకాణాలు మూసివేయించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Srikalahasti) నుంచి ధర్మప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు మంత్రి కొట్టు వచ్చారు. అయితే మంత్రి రాకను అధికారులు గోప్యంగా ఉంచడంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇమ్రాన్‌ ఖాన్‌ను విస్మరించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు.. నెట్టింట ట్రోలింగ్‌!

పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 14న) సందర్భంగా పీసీబీ చేసిన వీడియో ట్వీట్ ఈ వివాదానికి కారణమైంది. తమ దేశ క్రికెట్‌ ప్రముఖుల గురించి చెప్పే క్రమంలో 1992లో పాక్‌కు వరల్డ్‌ కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్ (Imran Khan) గొప్పతనాన్ని కావాలనే విస్మరించినట్లు విమర్శలు ఎదుర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనా చేతికి అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి రహస్యాలు..!

తన ఈమెయిల్స్‌ (emails)ను చైనా గూఢచారులు (Chinese spies) హ్యాక్‌ చేశారని ఎఫ్‌బీఐ వెల్లడించినట్లు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డాన్ బేకన్ (Don Bacon) వెల్లడించారు. దీంతో వ్యక్తిగత, ప్రచారానికి సంబంధించిన సున్నితమైన సమాచారం చోరీకి గురైనట్లు సోషల్‌ మీడియా వేదికగా ఆయన తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బీఎన్‌ఎన్‌ఎల్ అమృత్‌ ఉత్సవ్‌ ఆఫర్‌.. ఫ్రీగా ఇంటర్నెట్‌ స్పీడ్ పెంచుకోవచ్చు..!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘భారత్ ఫైబర్‌ అమృత ఉత్సవ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 100 Mbpsకు పెంచుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను 10 రోజుల పాటు వినియోగించవచ్చని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని