Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Aug 2023 13:12 IST

1. తిరుమల కాలిబాటలో చిరుత, ఎలుగు సంచారంపై వదంతులొద్దు: తితిదే

తిరుమల కాలిబాటలో చిరుత, ఎలుగు సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఓ ప్రకటన విడుదల చేసింది. చిరుత, ఎలుగుబంటి సంచారంపై కెమెరాలతో పర్యవేక్షిన్నట్లు తితిదే అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. కాలిబాట భక్తులకు అటవీ అధికారులు సూచనలు చేస్తున్నారని చెప్పారు. వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న చోట రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  ‘గని’ ఫ్లాప్‌.. అదే మేము చేసిన పెద్ద తప్పు: వరుణ్‌ తేజ్‌

తన గత చిత్రం ‘గని’ (Ghani) పరాజయంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆ సినిమా ఫ్లాప్‌కు కారణమేమిటో తమకు తెలుసన్నారు. ‘‘గని’ నా ఫస్ట్‌ ఫ్లాప్‌ కాదు. దానికి ముందు కూడా కొన్ని ఫ్లాప్‌లు ఉన్నాయి. సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్‌ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతుంటా. ‘మిస్టర్‌’ ఫ్లాప్‌ అయ్యాక.. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకుని దాన్ని ఫిక్స్‌ చేసుకున్నా.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు

తెదేపా అధినేత చంద్రబాబుతో గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. వైకాపాను వీడి తెదేపాలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన యార్లగడ్డ.. నేడు చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 19 ఏళ్లు అమెరికాలో ఉన్నప్పటి సంగతులు.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో స్వదేశానికి రావడం తదితర విషయాలను చంద్రబాబుకు వివరించినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్నారు. త్వరలోనే తెదేపాలో చేరుతానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే?

కాంగ్రెస్‌ (Congress) పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లోని లేహ్‌ (Leh) పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్‌ సరస్సుకు బైక్‌ రైడ్‌ చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే, రాహుల్‌ బైక్‌ యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) స్పందించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గండిపోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. గండిపోచమ్మ ఆలయం మండపంలోకి వరద నీరు చేరింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గత నెలలోనూ భారీగా వర్షాలు కురవడంతో గండి పోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద చేరుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనలు జరగొచ్చు.. భాజపాపై దిగ్విజయ్‌ తీవ్ర ఆరోపణలు!

అసెంబ్లీ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో నుహ్‌ తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) ఆరోపించారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు అర్థమైందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒక్క రోజులో.. ఒకే జిల్లాలో నలుగురు రైతన్నల ఆత్మహత్యలా?: చంద్రబాబు

ఏపీలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రైతుల కష్టాలు, సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. శనివారం ఒక్కరోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులో, ఒకే జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారంటే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అందుకే.. అన్‌అకాడమీ నన్ను తొలగించింది: ఉపాధ్యాయుడు

చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ఇటీవల ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ(Unacademy) వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదంటూ ఆయన్ను తొలగించడానికి గల కారణాన్ని వివరించింది. దీనిపై ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్‌ ( Karan Sangwan) శనివారం స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే.. HYD పోలీసుల ఆందోళన!

భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్‌లు తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఐసీసీ, బీసీసీఐ (BCCI) కూడా మ్యాచ్‌ల రీషెడ్యూల్‌ను ఖరారు చేసేశాయి.  ఉప్పల్‌ వేదికగా మూడు వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాక్‌లో బాంబుపేలుడు.. 11 మంది కార్మికుల మృతి

పాకిస్థాన్‌(pakistan)లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. వజీరిస్థాన్‌(Waziristan)లోని గుల్మిర్‌కోట్‌ ప్రాంతంలో ఓ వ్యాన్‌ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. శనివారం రాత్రి ఉత్తర వజీరిస్థాన్‌లోని షావల్‌ ప్రాంతం నుంచి కార్మికులు వ్యాన్‌లో దక్షిణ వజీరిస్థాన్‌ ప్రాంతానికి వెళ్తుండగా గుల్మిర్‌కోట్‌ ప్రాంతంలో ల్యాండ్‌మైన్‌ పేలి ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు