Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Sep 2023 13:14 IST

1. వారిద్దరిలో ఎవరికి చోటు..? వీరిద్దరిపైనేనా వేటు? వరల్డ్‌ కప్ కోసం భారత జట్టు ప్రకటన నేడేనా?

అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియా (Team India)ఆసియా కప్‌ (Asia Cup 2023) ఆడుతోంది. శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. గ్రూప్‌ స్టేజ్‌లో సోమవారం నేపాల్‌తో భారత్‌ తలపడనుంది. మరోవైపు సెప్టెంబర్‌ 4లోపు (సోమవారం) వరల్డ్‌ కప్‌ కోసం స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లైంగిక వేధింపులు.. ట్యూటర్‌ని చంపిన 14 ఏళ్ల బాలుడు

లైంగికంగా వేధిస్తున్న ఓ ట్యూటర్‌ని 14 ఏళ్ల బాలుడు హత్య (boy kills tutor) చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. శుక్రవారం పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకు క్రితం మూడు రోజుల ముందే హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూటర్‌ స్వలింగ సంపర్కుడని ప్రాథమిక విచారణలో తేలింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హాస్పిటల్‌లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (Sonia Gandhi admitted to hospital). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ పాలనలో పూర్తిగా సంక్షోభంలోకి ఆక్వా రంగం: నారా లోకేశ్‌

తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామని చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్‌ సైట్‌ నుంచి ‘యువగళం’ 203వ రోజు పాదయాత్రను లోకేశ్‌ ప్రారంభించారు. స్థానిక ఆక్వా రైతులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రికార్డుల రారాజు వెర్‌స్టాపెన్‌... ఈ రేసు వీరుడి కథ తెలుసా?

ఫార్ములా వన్‌ అనగానే.. పాత తరం అభిమానులకు గుర్తొచ్చే పేరు మైకెల్‌ షుమాకర్‌. ఇప్పటి అభిమానులైతే లూయిస్‌ హామిల్టన్‌ పేరు చెబుతారు. అసాధారణ వేగంతో ట్రాక్‌పై రయ్‌మంటూ విజయాల వేటలో సాగిన ఈ దిగ్గజాలు వేసిన ముద్ర అలాంటిది. మధ్యలో ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు. కానీ ఈ ఇద్దరి పేర్లు మాత్రం ఎఫ్‌1 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో సంచలన రేసర్‌ దూసుకొచ్చాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వీల్‌ఛైర్‌ ఇస్తారు.. ఉపాధీ చూపిస్తారు!

మనదేశంలో తయారయ్యే వీల్‌ఛైర్‌లలో అత్యంత సౌకర్యమైనవి అవి. వాటికి ఓ మోటార్‌బైకు లాంటిదాన్ని అటాచ్‌చేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు! తాము ఆవిష్కరించిన ఈ అత్యాధునిక వాహనం-కమ్‌- చక్రాలకుర్చీకి లక్షరూపాయల ధర నిర్ణయించింది ఆ స్టార్టప్‌. కానీ- పేదవాళ్ళకైతే పదివేల రూపాయలకే ఇస్తుంది. ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఉపాధినీ చూపిస్తుంది. అలా ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది... నియోమోషన్‌ అన్న అంకుర సంస్థ! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒడెస్సాపై భారీ దాడికి రష్యా యత్నం.. 22 డ్రోన్లను కూల్చిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పోర్టు నగరం అయిన ఒడెస్సాపై రష్యా ఆదివారం భారీ దాడికి యత్నించింది. ఈ క్రమంలో దక్షిణ ఒడెస్సా ప్రాంతంపై దాదాపు 25 డ్రోన్లను పంపింది. అయితే.. వీటిని తాము కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ‘‘రష్యా షహీద్‌ 136, 131 రకం డ్రోన్లను దక్షిణ, ఆగ్నేయ ఒడెస్సాపైకి పంపింది. మొత్తం 22 డ్రోన్లను మా వాయుసేన, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు కూల్చేశాయి’’ అని ఆ దేశ ఎయిర్‌ ఫోర్స్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బురదమయంగా మారిన ఎడారి.. చిక్కుకుపోయిన 70 వేల మంది..!

అమెరికా(USA)లో బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ (Burning Man festival) జరుగుతున్న నెవాడలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం దెబ్బకు బురద మయంగా మారిపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70,000 మంది ఆ బురదలో చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. వాహనాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ (Heath Streak) (49) కన్నుమూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫ్లవర్‌ సోదరులతోపాటు జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు వన్నె తెచ్చాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఆదిత్య-ఎల్‌1.. తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతం

దేశ తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ను నిర్దేశిత భూ కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు ‘ఇస్రో’ వెల్లడించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)’ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. దీంతో ‘ఆదిత్య-ఎల్‌1’ ఇప్పుడు 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని