Burning Man festival: బురదమయంగా మారిన ఎడారి.. చిక్కుకుపోయిన 70 వేల మంది..!

అమెరికా (USA)లో ఎడారి మధ్యలో నిర్వహించే అతిపెద్ద వేడుకైన బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ (Burning Man festival)కు ఓ చిక్కొచ్చి పడింది. ఒక రోజు రాత్రంతా వర్షం కురవడంతో ఈ ఎడారి మొత్తం బురద మయంగా మారిపోయింది. ఎవరూ అక్కడి నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది.

Updated : 03 Sep 2023 11:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లో బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ (Burning Man festival) జరుగుతున్న నెవాడలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం దెబ్బకు బురద మయంగా మారిపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70,000 మంది ఆ బురదలో చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. వాహనాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి.

ఇక్కడ భూఉపరితలం ఎండే వరకు వాహనలను ముందుకు అనుమతించమని ఇప్పటికే నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకులు ఆహారం, నీరు వాడుకొని ఎక్కడైన పొడిగా వెచ్చటి ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం ది బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధీనంలో ఉంది.

ట్రంప్‌తో స్వల్ప భేదాభిప్రాయాలే.. వివేక్‌ రామస్వామి వెల్లడి

ఆగస్టు 27న బర్నింగ్‌మ్యాన్‌ ఫెస్టివల్‌ మొదలైంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హిల్లరి హరికేన్‌ తాకింది. ఒక రాత్రి మొత్తం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కరాత్రిలో కురిసింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఎవరూ ఇక్కడికి రావడానికి లేదా.. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్‌ సిటీని మూసివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొంత మంది మాత్రం కాలి నడకనే ఈ బురద ఎడారి నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని