Sonia Gandhi: హాస్పిటల్‌లో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆమె స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.

Updated : 03 Sep 2023 12:27 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (Sonia Gandhi admitted to hospital). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రమే ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని