Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Sep 2023 13:15 IST

1. ఐఫోన్లకు అత్యవసర అప్‌డేట్‌.. పెగాసస్‌ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం!

యాపిల్‌ తమ ఐఫోన్‌ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌ల (iPhone security updates)ను విడుదల చేసింది. కొంతమంది హ్యాకర్లు ఫోన్లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యాపిల్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ల (iPhone security updates)ను అందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్‌ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య

తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు. రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్‌ మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతోమంది అభిమానులున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు కూడా మహీ అంటే ఇష్టమేనట. అందుకే ధోనీ అమెరికాలోనే ఉన్నాడని తెలుసుకునే అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి గోల్ఫ్‌ (Golf) గేమ్‌ కూడా ఆడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డ్రాగన్‌ కొరికిన యాపిల్‌..! రెండు రోజుల్లో రూ.16 లక్షల కోట్లు ఆవిరి..!

అమెరికా (USA) టెక్‌ దిగ్గజం యాపిల్‌(Apple)కు చైనా (China) సెగ గట్టిగానే తాకింది. ఈ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్‌ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేరకు విలువ కోల్పోయాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు ఆరు శాతానికి సమానం. యాపిల్‌కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రపంచానికి షాకిచ్చిన ఉత్తరకొరియా.. న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ

కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్‌ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇండస్ట్రీలో విషాదం.. ‘జైలర్‌’ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్‌, నటుడు జి. మారిముత్తు (57) (G Marimuthu) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఇప్పటి వరకూ వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక చివరగా ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’లో కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కర్నూలులో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.  స్థానిక లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ.. బాత్‌రూమ్‌లో తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. గన్‌ శబ్దంతో సిబ్బంది వెళ్లి చూసేసరికి హెడ్‌కానిస్టేబుల్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ దాడికి స్టార్‌లింక్‌ సేవలు ఇవ్వం.. మస్క్‌ నిర్ణయం..!

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌(Ukraine)కు స్పేస్‌ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) షాకిచ్చారు. తమకు అత్యవసరంగా  స్టార్‌ లింక్‌ సేవలను అందించాలని ఉక్రెయిన్‌ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం ఆయన తిరస్కరించారు. ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తే యుద్ధానికి పెద్ద కవ్వింపు చర్యగా మారుతుందని.. అప్పుడు సంక్షోభం మరింత తీవ్రమవుతుందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి: చంద్రబాబు

పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్‌ను తీసుకొస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. సనాతన ధర్మ వివాదంపై యోగి స్పందన

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) స్పందించారు. ‘‘రావణుడి అహంకారంతో సనాతన ధర్మం అంతం కాలేదు.. కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు.. బాబర్‌, ఔరంగజేబుల దురాగతాలకు సనాతన ధర్మం నశించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు