Marimuthu: ఇండస్ట్రీలో విషాదం.. ‘జైలర్‌’ నటుడు కన్నుమూత

నటుడు జి. మారిముత్తు (G Marimuthu) కన్నుమూశారు. ఆయన చివరసారిగా ‘జైలర్‌’లో నటించారు.

Updated : 08 Sep 2023 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్‌, నటుడు జి. మారిముత్తు (57) (G Marimuthu) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఇప్పటి వరకూ వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక చివరగా ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’లో కనిపించారు. విలన్ గ్యాంగ్‌లో ప్రధాన వ్యక్తి పాత్ర పోషించారు. వెండితెరపై విభిన్న పాత్రలతో అలరించిన మారిముత్తు.. బుల్లితెరపై పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. అలాగే దర్శకుడిగా మూడు సినిమాలు తీశారు. మారిముత్తు మృతిపై అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు (#RIPMarimuthu). 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని