ChandraBabu: డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి: చంద్రబాబు

పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకురావాలి.. వాళ్లను ధనికులను చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 08 Sep 2023 12:58 IST

బనగానపల్లె: పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్‌ను తీసుకొస్తామని చెప్పారు.

‘‘ధనికులు ఎక్కువవుతున్నారు. పేదవాళ్లు మాత్రం బాగుపడట్లేదు. అందుకే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేదవాళ్లందరినీ భాగస్వాములను చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాలి. అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలి. సమర్థత పెంచడానికి, ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని