Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jun 2024 17:06 IST

1. శ్వేత సౌధాన్ని చుట్టుముట్టిన పాలస్తీనా మద్దతుదార్లు..!

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House) పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగించాలని, టెల్‌అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని ఈ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు. పూర్తి కథనం

2. ఒడిశా సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ.. తెరపైకి సురేశ్‌ పూజారి!

ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమవుతోంది. తొలుత జూన్‌ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ.. దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్‌ కారణంగా తాజా మార్పు చోటు చేసుకుందని భాజపా నేతలు జతిన్‌ మొహంతి, విజయ్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు. పూర్తి కథనం

3. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాం: కిషన్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తామని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంకల్పపత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. పూర్తి కథనం

4. ఆయనే లేకుంటే టెస్లా ఇలా ఉండేది కాదేమో..! భారత సంతతి వ్యక్తిపై మస్క్‌ ప్రశంసలు

విద్యుత్‌ కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla) ఆటోపైలట్‌ బృందంలో భారత సంతతికి చెందిన అశోక్​ ఎల్లుస్వామి ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌లో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. కృత్రిమ మేధ, ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌లో టెస్లా సాధించిన విజయంపై అశోక్‌, అతని బృందానికి మస్క్‌ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి కథనం

5. తప్పిన పెనుప్రమాదం: విమానం టేకాఫ్‌ కాకముందే.. మరో విమానం ల్యాండింగ్‌..!

వందల మంది ప్రయాణికులకు శనివారం ముంబయి విమానాశ్రయంలో (Mumbai AirPort) పెనుప్రమాదం తప్పింది. ఓ ఇండిగో ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అవుతోంది.   పూర్తి కథనం

6. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి.. శరీర భాగాలు గుర్తింపు!

పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆయన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.. ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు.  పూర్తి కథనం

7. దాయాదుల పోరు.. భారత్ 60%.. పాకిస్థాన్ 40%!

టీ20 ప్రపంచ కప్‌లో ఇవాళ రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) టీమ్‌ఇండియా - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ జరగనుంది. ఇందుకు వేదిక న్యూయార్క్‌లోని నాసౌవ్‌ మైదానం. నిలకడలేని బౌన్స్‌తో పిచ్‌ వార్తల్లో నిలిచింది.  పూర్తి కథనం

8. ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు టచ్‌లో ఉన్నారు: శిందే శివసేన

శివసేన (Shiv Sena UBT) ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు తమకు టచ్‌లో ఉన్నారంటూ శిందే వర్గం శనివారం రాత్రి ప్రకటించింది. ఈ విషయాన్ని థానే నుంచి విజయం సాధించిన ఆ వర్గం ఎంపీ నరేష్ మ్హస్కే వెల్లడించారు. పూర్తి కథనం

9.  ప్రభుత్వ ధనం దుర్వినియోగంపై ఫేక్‌ నోట్‌.. కేసు నమోదు

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్‌నోట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్‌ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్‌ నేరగాళ్లు ఓ ఫేక్‌నోట్‌ను రూపొందించారు.  పూర్తి కథనం

10. కిడ్నాప్‌ కలకలం.. సినీఫక్కీలో ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శిశువర్దన్‌రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని