Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 21 Apr 2023 21:03 IST

1. వెయ్యి కి.మీ మైలురాయి చేరుకున్న యువగళం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 1000కి.మీ మైలు రాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్‌ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలో 21వ వార్డును దత్తత తీసుకోవాలని లోకేశ్‌ నిర్ణయించారు. కనీస మౌలిక వసతులు లేక దళితులు బీసీలు, మైనార్టీలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడటాన్ని తాను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో 21వ వార్డును దత్తత తీసుకుంటానని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేఎంసీ మెడికో ప్రీతిది ఆత్మహత్యే: వరంగల్‌ సీపీ

కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యే అని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఆమె ఇంజెక్షన్‌ ద్వారా పాయిజన్‌ తీసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. తాజాగా వచ్చిన ప్రీతి శవపరీక్ష నివేదికను పరిశీలించి మీడియాకు వివరాలను వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ప్రధాన కారణమని సీపీ తెలిపారు. వారం పది రోజుల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాళ్లు విసిరిన వైకాపా శ్రేణులు. చంద్రబాబు హెచ్చరిక

ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పొల్గొన్నారు. ఓ వైపు ఈదురుగాలులు వీస్తున్నా.. వర్షం కురుస్తున్నా.. చంద్రబాబు రోడ్‌షో కొనసాగించారు. రోడ్‌షో నేపథ్యంలో యర్రగొండపాలెంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. చంద్రబాబు యర్రగొండపాలెం వస్తుండగా.. వైకాపా శ్రేణులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి?: హైకోర్టు

తనపై నమోదైన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కొట్టివేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజకీయ దురుద్దేశాలతో కావాలనే తనపై ఈ కేసు పెట్టారని సంజయ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ ఇదే!

ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్‌ -16వ (IPL 2023) సీజన్‌ ప్లేఆఫ్స్, ఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌, వేదికలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఖరారు చేసింది. చెన్నై, అహ్మదాబాద్‌ మైదానాలను వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది. మే 23న క్వాలిఫయర్‌-1, 24న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చాట్‌జీపీటీ గొప్పదే.. కానీ, ఉద్యోగుల్ని భర్తీ చేయలేదు: నారాయణ మూర్తి

చాట్‌జీపీటీ వంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు మనుషులను భర్తీ చేయలేవని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాచార సేకరణకు, విషయ సముపార్జనకు చాట్‌జీపీటీ గొప్ప సాధనం. కానీ, కొన్ని విషయాల్లో అది మనుషులతో పోటీ పడలేదు’’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘మహమ్మారి ఇంకా ముగియలేదు..!’ 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోన్న కొవిడ్‌ వైరస్‌ కారణంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కేసుల పెరుగుదల నమోదైన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 11 వేలు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 66 వేలకు చేరుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎనిమిది రాష్ట్రాలకు లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అతీక్‌ భార్య కోసం డ్రోన్లతో వేట.. ఎవరీ షాయిస్తా పర్వీన్‌..!

ఉమేశ్‌పాల్‌ హత్యకేసులో కీలక నిందితురాలిగా భావిస్తున్న అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed) భార్య షాయిస్తా పర్వీన్‌ (Shaista Parveen) కోసం ఉత్తరప్రదేశ్‌(UP) పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు, ఎస్టీఎఫ్‌ (స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌) సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌ - కౌసంబీ ప్రాంతంలోని గంగా కచార్‌ వద్ద ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గోద్రా రైలు దహనం కేసు.. ఎనిమిది మంది దోషులకు బెయిల్‌

గుజరాత్‌ (Gujarat)లో 2002 నాటి గోద్రా రైలు దహనం కేసు (Godhra Train Burning Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. 17 ఏళ్లకుపైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దాన్ని ఆధారంగా చేసుకుని.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆధిపత్య పోరుతో రక్తసిక్తం.. సూడాన్‌లో 400 దాటిన మృతులు

సూడాన్‌ (Sudan)పై పట్టు కోసం సైన్యం (Army), పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాల మధ్య కొనసాగుతున్న పోరుతో దేశం రక్తసిక్తంగా మారింది. ఖార్తూమ్‌ సహా పలు నగరాల్లో భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటివరకు 413 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని