Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Feb 2024 20:58 IST

1. ఆస్తి పన్ను వివాదాల పరిష్కారానికి ‘పీటీపీ’

ఆస్తి పన్ను చెల్లింపు, వివాదాలకు సంబంధించి నగర పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారమ్స్ (పీటీపీ) పేరుతో సర్కిల్ కార్యాలయాల్లో మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి శ్రీదేవి అరెస్టు

నగర చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారిణి (CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్‌ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆసక్తికరంగా నెల్లూరు రాజకీయం.. కందుకూరు ఎమ్మెల్యేతో వేమిరెడ్డి భేటీ!

కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మహీధర్‌ రెడ్డి స్వగ్రామం మాచవరంలో ఆయన మంతనాలు జరిపారు. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డిని తమ పార్టీలో చేరాలని తెదేపా నాయకులు ఆహ్వానించడం, మార్చి 2న నెల్లూరులో చంద్రబాబు పర్యటన ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్నికల వేళ.. తెదేపా కొత్త కార్యక్రమం!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ(TDP) చేపట్టిన ‘రా.. కదలిరా’ సభలు మార్చి 4న రాప్తాడులో ముగియనున్నాయి. దీంతో మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) సిద్ధమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి సవాల్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని, మల్కాజిగిరిలోనే కాదు.. ఎక్కడ పోటీ చేసినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేడారం హుండీ లెక్కింపు.. తొలి రోజు ఆదాయం ₹3.15 కోట్లు

మేడారం మహాజాతర (Medaram) హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. తొలిరోజు 134 హుండీలు లెక్కించగా రూ.3.15 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని బ్యాంకు సిబ్బందికి దేవాదాయ శాఖ అధికారులు అందజేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హిమాచల్‌లో ‘ఆపరేషన్‌ కమలం’కు ప్రియాంక అడ్డుకట్ట!

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక (Rajya Sabha Elections) అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. ప్రభుత్వంపై ‘అవిశ్వాసం’ అస్త్రం ప్రయోగించేందుకు భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపించాయి. ఈనేపథ్యంలో భాజపా చేసిన ‘ఆపరేషన్‌ కమలం’ (Operation Lotus)కు అడ్డుకట్ట వేసి ప్రజాతీర్పును రక్షించడంలో ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కీలకపాత్ర పోషించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పీఎం కిసాన్‌లోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలోకి (PM-KISAN scheme) 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోమాలో బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌..?

బ్రిటన్‌ రాజ కుటుంబానికి (Britain Royal Family) సంబంధించి ఏ విషయాన్నైనా యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంది. తాజాగా యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton)పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ నుంచి ఆమె కనిపించకపోవడమే ఇందుకు కారణం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు.. విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతినిచ్చింది. సాగర్‌ కుడి కాల్వ హెడ్‌ రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని