GHMC: ఆస్తి పన్ను వివాదాల పరిష్కారానికి ‘పీటీపీ’.. మార్చి 3 నుంచి

ఆస్తి పన్ను చెల్లింపు, వివాదాలకు సంబంధించి నగర పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

Published : 29 Feb 2024 19:59 IST

హైదరాబాద్‌: ఆస్తి పన్ను చెల్లింపు, వివాదాలకు సంబంధించి నగర పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారమ్స్ (పీటీపీ) పేరుతో సర్కిల్ కార్యాలయాల్లో మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే పీటీపీలో.. ఆస్తి పన్నుల మదింపు, చెల్లింపు, కోర్టు వివాదాలు సహా ఇతర పన్నులకు సంబంధించిన సమస్యలనూ పరిష్కరించుకోవచ్చని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని