Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Feb 2024 17:07 IST

1. ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రైతు బంధు, రైతు బీమా కుంభకోణంలో ఇద్దరి అరెస్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. భారత్‌లో పేదరికం 5 శాతమే: నీతి ఆయోగ్‌

భారత్‌లో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్‌(Niti Aayog) సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్)ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బైజూస్‌ విషయం త్వరగా తేల్చండి.. అధికారులకు కేంద్రం ఆదేశం

ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వాటాదారుల ఒత్తిడితో సతమతమవుతున్న బైజూస్‌ (BYJUS) విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఖాతా పుస్తకాల తనిఖీకి ఆదేశించిన కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రీట్వీట్ చేసి తప్పు చేశా: పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌ క్షమాపణ

పరువుకు భంగం కలిగించే వీడియోను రీట్వీట్‌ చేసి తప్పు చేశానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court) ఎదుట అంగీకరించారు. ఒక పరువునష్టం కేసు (defamation case)లో తనకు జారీ అయిన సమన్లను దిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించగా దానిపై నేడు విచారణ జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. యుద్ధం వేళ.. పాలస్తీనా ప్రధాని రాజీనామా

పాలస్తీనా ప్రధానమంత్రి (Palestine Prime Minister) మొహమ్మద్‌ శతాయే రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్‌ బ్యాంకులో హింస తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను అందజేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. తెదేపాలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూత

సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. పంకజ్‌ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచిన జపాన్‌ స్లిమ్‌..!

జపాన్‌ (Japan) మూన్‌ ల్యాండర్‌ మరో మైలురాయిని దాటింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచింది. సోమవారం ఉదయం జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ (జాక్సా) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. ‘‘నిన్న రాత్రి స్లిమ్‌కు ఒక కమాండ్‌ పంపించగా, దానికి స్పందన వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు