TDP: తెదేపాలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు.

Updated : 26 Feb 2024 15:03 IST

విజయవాడ: వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైకాపాలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. బలహీనవర్గాలకు వైకాపాలో అన్నీ అవమానాలే. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం. నూజివీడులో అందరితో కలిసివెళ్తూ తెదేపా జెండా ఎగురవేస్తా’’అని తెలిపారు. పార్థసారథితోపాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ తదితరులు తెదేపాలో చేరారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని), శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెదేపా-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని