Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 May 2024 17:07 IST

1.ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్‌ దర్యాప్తు

ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను వేయనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు: మంత్రి తుమ్మల

తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్‌ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు

గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 14న మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. గురువారం రాత్రి నుంచి ఎమ్మెల్యే, అతని సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. షర్మిల పిటిషన్‌.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే

ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్‌ జిల్లా వైకాపా అధ్యక్షుడు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు.. హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్‌ 16న ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్‌, ఎస్పీపై మోదీ ధ్వజం

విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనాకు తగ్గి.. భారత్‌కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస

భారత్‌ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్‌

 చట్టబద్ధ పాలనను విస్మరించడం, పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలకు తూట్లు పొడవడం వంటి చర్యలతో ఆసియా భూభాగం, సముద్ర జలాల్లో సరికొత్త ఉద్రిక్తతలు తలెత్తాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. ‘‘ప్రపంచం ప్రస్తుతం మూడు ‘ఎఫ్‌’ల సంక్షోభం ఎదుర్కొంటోంది. అవే ఫ్యూయెల్‌ (ఇంధనం), ఫుడ్‌ (ఆహారం), ఫెర్టిలైజర్స్‌ (ఎరువులు)’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పంచుకున్నారు. పాల్ జి.హెవిట్‌ రాసిన ‘కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్‌’ ఛాన్స్‌.. అదెలాగంటే?

ప్లేఆఫ్స్‌ రేసులోని నాలుగు బెర్తుల్లో ఒక్కటి మాత్రమే ఇంకా ఫిల్‌ కాలేదు. దానికోసం చెన్నై - బెంగళూరు బరిలో నిలిచాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడి మ్యాచ్‌ రద్దు అయితే చెన్నై నేరుగా నాకౌట్‌కు వెళ్లిపోతుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందంటే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?

పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఈ మేరకు ‘బ్లూ రెసిడెన్సీ వీసా’ల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని