Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jul 2023 09:11 IST

1. సింహాచలం గిరిప్రదక్షిణ.. ఇసుకేస్తే రాలనంతగా భక్త జనం

సింహాచలం గిరిప్రదక్షిణ రెండోరోజు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గిరిప్రదక్షిణకు సోమవారం ఉదయానికి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఉభయగోదావరి, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గాలు కిక్కిరిసిపోయి గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పాతగోశాల టీ జంక్షన్‌ వద్ద రద్దీ జనసంద్రాన్ని తలపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విజయవాడ - చెన్నై మధ్య వందేభారత్‌

ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జనసేన అధినేత అల్టిమేటం.. రహదారి పనులు ప్రారంభం

‘‘రాజోలు బహిరంగ సభ సాక్షిగా వైకాపా నాయకులకు, ప్రభుత్వానికి చెబుతున్నా.. మీకు 15 రోజులు సమయం ఇస్తున్నా.. ఆ లోపు మీరు కనుక రాజోలు బైపాస్‌ రోడ్డు వేయకపోతే.. మేమే శ్రమదానం చేసి, నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను. వారాహి విజయ యాత్రలో భాగంగా జూన్‌ 25న మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలివి’’ ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ వర్సిటీ పరిస్థితేంటి?

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలనా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలి, ఉపకులపతి మధ్య సాగిన విభేదాలు, ఇవి కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో వీసీ అనిశాకు పట్టుబడి జైలుకెళ్లడం తెలిసిందే. డ్రాయింగ్‌ ఆఫీసర్‌గా రిజిస్ట్రార్‌ బ్యాంకు చెక్కులు, బిల్లులపై సంతకాలు చేసినా వాటికి నోట్‌షీట్‌ను అనుమతిస్తూ వీసీ సంతకం చేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మందుల పిచికారీకి హెలికాప్టర్‌.. రూ.7 కోట్లతో కొనుగోలు చేయనున్న రైతు

పొలంలో పురుగు మందుల పిచికారీ కోసం ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. కొందరు రైతులు సొంతంగా వీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌ కొనాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణకు 300 కి.మీ దూరంలోని కొండగావ్‌ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు రూ.7 కోట్లతో కొనుగోలు చేయబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పట్టాలపై స్పృహ తప్పినా.. ప్రాణాలు దక్కించుకున్న మహిళ

ఓ మహిళ స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో ఓ గూడ్సు రైలు ట్రాక్‌పై నుంచి వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాబూపుర్‌ గ్రామానికి చెందిన హరి ప్యారీ(40) అనే మహిళ.. మందులు కొనేందుకు సహవర్‌ రైల్వేస్టేషన్‌ వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాత్తుగా తల తిరిగి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విండీస్‌ పతనానికి కారణమదే

ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్‌ క్రికెట్‌ను దెబ్బ తీశాయని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు. నైపుణ్యం ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి విండీస్‌ మంచి ఉదాహరణ. రాజకీయాలే ఆ జట్టును దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి విండీస్‌కు ఇంకేమి మిగల్లేదు’’ అని వీరూ ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భద్రకాళి వైభోగం.. నేడు శాకంబరి ఉత్సవం

 ఏ అమ్మవారి ఆలయంలో లేని విధంగా ఓరుగల్లు శ్రీభద్రకాళి దేవాలయంలో ఏటా నాలుగు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. చైత్రంలో వసంత నవరాత్రులు, వైశాఖంలో శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రాహ్మోత్సవాలు, ఆషాఢంలో శాకంబరి పక్షోత్సవాలు, ఆశ్వీయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరి మహోత్సవాలకు విశిష్ఠత ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొబ్బరికాయ తెచ్చిన తంటా!

చాలా మంది బోరు వేసే సమయంలో భూగర్భ జలాలు ఎక్కడ అధికంగా ఉన్నాయో కొబ్బరి కాయను చేతిలో పెట్టుకుని పరిశీలించడం సాధారణం. చింతలబస్తీలో నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న సామాజిక భవనానికి ఎంపీ నిధుల  నుంచి పవర్‌ బోరు మంజూరైంది.బోరు వేసేందుకు భారీ యంత్రం తీసుకొచ్చారు. సామాజిక భవనం సమీపంలో బోరు తవ్వేందుకు వీల్లేకపోవడంతో రోడ్డుపైనే వేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో నీళ్లు అధికంగా ఉండే ప్రదేశాన్ని కొబ్బరి కాయ చేతిలో పెట్టుకుని పరిశీలిస్తే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని