జనసేన అధినేత అల్టిమేటం.. రహదారి పనులు ప్రారంభం

‘‘రాజోలు బహిరంగ సభ సాక్షిగా వైకాపా నాయకులకు, ప్రభుత్వానికి చెబుతున్నా.. మీకు 15 రోజులు సమయం ఇస్తున్నా.. ఆ లోపు మీరు కనుక రాజోలు బైపాస్‌ రోడ్డు వేయకపోతే..

Updated : 03 Jul 2023 06:04 IST

రాజోలు, న్యూస్‌టుడే: ‘‘రాజోలు బహిరంగ సభ సాక్షిగా వైకాపా నాయకులకు, ప్రభుత్వానికి చెబుతున్నా.. మీకు 15 రోజులు సమయం ఇస్తున్నా.. ఆ లోపు మీరు కనుక రాజోలు బైపాస్‌ రోడ్డు వేయకపోతే.. మేమే శ్రమదానం చేసి, నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను. వారాహి విజయ యాత్రలో భాగంగా జూన్‌ 25న మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలివి’’ ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రహదారికి ర.భ.శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. నాలుగేళ్లుగా భారీ గుంతలతో అధ్వానంగా ఉన్న బైపాస్‌ రహదారిని గతేడాది స్థానిక దుకాణదారులు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించారు. ఇటీవల మరింత ప్రమాదకరంగా మారిందని, ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలిపినా.. స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌ హెచ్చరికతో రహదారి పనుల్లో కదలిక వచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్‌ అండ్‌ బీ జేఈ సురేష్‌ మాట్లాడుతూ రహదారి అభివృద్ధికి మూడు నెలల కిందే రూ.90 లక్షలతో ప్రతిపాదనలు చేశామని, నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. నిర్వహణ నిధులతో ఈలోపు ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేసి తీర్చిదిద్దుతామన్నారు. నిధులు మంజూరైన వెంటనే సీసీ రహదారి నిర్మిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని