Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jul 2023 09:09 IST

1. ధరహాసం కొద్దిరోజులే.. మిగిలిన రోజుల్లో కన్నీళ్లే

మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.130 పైమాటే.. రైతుకు కూడా రూ.100 వరకు లభిస్తోంది. ఇది మంచి ధరే. అంతమాత్రాన అది లాభాల పంటే అనుకుంటే పొరపాటే. రైతులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో ఇంత ధర వచ్చింది. ఈ పరిస్థితి మహా అయితే 15, 20 రోజులే.. మరి మిగిలిన రోజుల్లో..? రైతులకు గిట్టుబాటయ్యేది కిలోకు సగటున రూ.2 నుంచి రూ.5 మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మేం కబ్జా చేస్తాం.. మీకు చేతనైంది చేసుకోండి

సాయిబాబా మందిరం నిర్మాణం పేరిట.. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమిని ఆక్రమించేందుకు వైకాపా వారు పక్కా ప్రణాళికలు రూపొందించారు. నెల రోజులుగా సాగుతున్న ప్రయత్నాలు వెలుగులోకొచ్చినా... వైకాపా నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు షెడ్డు నిర్మించి, సాయిబాబా విగ్రహం పెట్టారు. దేవస్థానం అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధిక పింఛను అర్హులకు ఊరట

 అధిక పింఛనుకు అర్హత ఉన్నవారికి ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో జమ చేయాల్సిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది. బకాయిలను మూడు నెలల్లోగా ప్రతి నెలా 24 శాతం చొప్పున వడ్డీ సహా చెల్లించాలని నెల క్రితం వరకు జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా దీన్ని 8 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్‌ ఖాతాలో నిల్వపై భవిష్యనిధి సంస్థ చెల్లిస్తున్న వడ్డీ తరహాలోనే బకాయిలపైనా వసూలు చేయాలని నిర్ణయించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పట్టణాలకు వలస.. వసతులే సమస్య

పల్లెలు పట్టణాలవుతున్నాయి.. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హార్మ్యాలు వెలుస్తున్నాయి. వీటన్నిటికీ కారణం జనాభా విపరీతంగా పెరుగుతుండటమే... ఉమ్మడి వరంగల్‌.. ఆరు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ప్రతి చోట జనాభా క్రమంగా పెరిగిపోతోంది. వరంగల్‌ కార్పొరేషన్‌ సహా జిల్లా కేంద్రాలుగా మారిన పురపాలక సంఘాల్లోనూ, పురపాలికలుగా మారిన పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌లదే భవిష్యత్తు

‘‘చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న నమ్మకం విద్యార్థులకు బలంగా ఉండటం వల్లే ఇంజినీరింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇందులో సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులను ఎంపిక చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉద్యోగాలొస్తాయనే నమ్మకమే ఇందుకు కారణం.  వాస్తవానికి ఇంజినీరింగ్‌ కోర్సులన్నీ ఉత్తమమైనవే. కారు తయారు చేయాలంటే మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీర్లు కావాలి తప్ప కంప్యూటర్‌ ఇంజినీరు కాదు కదా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రపంచంలోనే ఎత్తయిన దేవాలయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన దేవాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయాన్ని జస్పూర్‌ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్‌ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘జైలు’ భయంతో బల్లిని మింగేశాడు

అత్యాచారం కేసులో అరెస్టయి పోలీసుల రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది. మహేశ్‌ అనే యువకుడు ఓ బాలికను అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జైలుకు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో భయంతో అతను పోలీస్‌స్టేషన్‌లోనే బల్లిని మింగాడని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉక్రెయిన్‌కు సభ్యత్వం కష్టమే

అగ్ర దేశాల అండతో రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న ఆశ తీరేలా లేదు. నాటోలో సభ్యత్వంపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ కాలికి బలపం కట్టుకుని అన్ని దేశాలూ తిరిగి అభ్యర్థిస్తున్నా ఫలితం దక్కేలా లేదు. ‘చేర్చుకోం... చేయూతనిస్తాం’ అనేదే ఉక్రెయిన్‌ విషయంలో ప్రస్తుతానికి నాటో దేశాల వైఖరిగా కనిపిస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్‌ సభ్యత్వానికి అంగీకరిస్తే అనూహ్య పరిణామాలకు, యుద్ధ విస్తరణకు అది దారి తీస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలా..?

గర్భం ధరించామని తెలియగానే కొంతమంది తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యే దాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విదేశీ వర్సిటీల్లో.. ఉచితంగా నేర్చుకుందాం!

విదేశాలకు వెళ్లి చదవాలనీ, నాణ్యమైన విద్యా బోధనను అందుకోవాలనీ చాలామంది విద్యార్థులు అనుకుంటారు. కానీ రకరకాలైన కారణాల వల్ల వెళ్లలేకపోతుంటారు. ఫీజు  ఎక్కువనే భయం ఉండనే ఉంది. కానీ అక్కడికి వెళ్లకుండానే ఆ యూనివర్సిటీల్లో చదివే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సంస్థల్లో వివిధ కోర్సులు చేయవచ్చు. ఆ వివరాలేంటో చూద్దామా!పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని