Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jul 2023 09:18 IST

1. గుర్తింపు లేని వర్సిటీలు!

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్‌ (న్యాక్‌) ఉత్తమ గ్రేడ్‌ పొందడంలో వెనకబడుతున్నాయి. దశాబ్దాల క్రితం నెలకొల్పిన వర్సిటీలు సైతం సాధారణ గ్రేడ్‌తో సరిపుచ్చుకుంటున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 వర్సిటీలు ఉంటే రెండు వర్సిటీలకు ఇప్పటికీ గుర్తింపు లేదు. రెండు మాత్రం కనాకష్టంగా ‘ ఏ’ ప్లస్‌ సాధించాయి. తాజాగా జేఎన్‌టీయూహెచ్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా గతంలో ఉన్న ‘ఏ’ గ్రేడ్‌ మాత్రమే దక్కించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు కమిటీ(ఎంసీసీ) శ్రీకారం చుట్టింది. అఖిల భారత కోటా మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు 4 రౌండ్లలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రౌండ్‌కు ఆగస్టు 1న రిజిస్ట్రేషన్‌ పూర్తికానుండగా సీట్ల కేటాయింపు ఫలితాలను 5న వెల్లడించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పరమశివుణ్ని పెళ్లి చేసుకున్న యువతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి పరమశివుడిని పెళ్లి చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయంగా మారింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు.. చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. శివుడిపై మమకారాన్ని పెంచుకున్న వారి కుమార్తె ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం

 రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేగింది. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా రెడ్‌ డైరీ ప్రస్తావనను సోమవారం అసెంబ్లీలో తెచ్చారు. దీంతో సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఆయనపై దాడి చేసి నెట్టేశారు. అంతేకాకుండా సభ నుంచి సస్పెండు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ ఆయనను సస్పెండు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీసం కాడ్మియం ఆర్సెనిక్‌తో గుండెకు చిచ్చు

క్యాన్సర్‌ కారకాలుగా ముద్రపడిన సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌లు గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వల్పస్థాయిలో దీర్ఘకాలం పాటు ఈ రసాయనాల తాకిడికి గురైనా.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వారు పేర్కొన్నారు. నానాటికీ పెరుగుతున్న హృద్రోగాల కట్టడికి మిగతా అంశాలతోపాటు ఈ విషతుల్య పదార్థాల నియంత్రణపైనా దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నెలరోజులైంది... ఆయనెక్కడ?

వివిధ దేశాలతో ఏదో వివాదంతో వార్తల్లో ఉండే చైనా విదేశాంగశాఖ... తాజాగా తమ విదేశాంగమంత్రి కారణంగానే ఇంటాబయటా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్‌ (57) నెలరోజులుగా కనిపించటం లేదు. అనారోగ్యం అంటూ చెబుతున్నా అమెరికా పౌరసత్వమున్న చైనా జర్నలిస్టుతో వివాహేతర సంబంధమే ఆయన మాయమవటానికి కారణమని చెబుతున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు చిన్‌గాంగ్‌ అత్యంత సన్నిహితుడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 34 సరిపోవు.. 50కి తగ్గేదేలే!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు చెందినవారికి 50కి తగ్గకుండా టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీలోని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రెండేసి అసెంబ్లీ స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని, వారు పోటీ చేసే స్థానాలను, అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ వెంటనే చేపట్టాలని పీసీసీ నిర్ణయించింది. 2018 ఎన్నికల్లో బీసీలకు 24 స్థానాల్లో టికెట్లు ఇచ్చామని,.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నత్తకు నేర్పిన నడకలివి!

మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడం.. మధ్యలో ఉన్న వంతెనల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం రూ.6,400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) అనే విదేశీ బ్యాంకు రుణం మంజూరు చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గుల్ల అవుతున్నా.. తగ్గమంతే!

ఈ చిత్రాన్ని పరిశీలిస్తే.. విశాఖ పర్యాటక ప్రాంతం రిషికొండను తలపిస్తోంది కదా..! ఇది విజయవాడ నగరానికి అత్యంత సమీపంలోని గుబ్బలగుట్ట. అధికార యంత్రాంగం, అధికార పార్టీ నేతలు చేయిచేయి కలిపితే.. ఎలాంటి కొండలనైనా.. గుల్ల చేయవచ్చనడానికి ఇదే నిదర్శనం. తనకు అధికారులు అనుమతి ఇచ్చారని.. ఏకంగా కొండను బాంబులు పెట్టి పిండి చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉచితం..ప్రశ్నార్థకం?

 ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ద్వారా ఉచిత విద్య అందించాలనే పథకం అమలు ఆదిలోనే అవస్థలు ఎదుర్కొంటోంది.  పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇచ్చి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్య అందిస్తారనుకున్న తల్లిదండ్రుల ఆశలు లకిందులయ్యాయి.  ఫీజు మాత్రమే మినహాయింపు ఉంటుందని, విద్యాసామగ్రి కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని