Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Mar 2024 09:00 IST

1. పటీదార్‌కు పరీక్ష

ప్రతిభ పరంగా ఢోకా లేదు. నైపుణ్యాలనూ సందేహించే అవసరం లేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో మెరుగైన గణాంకాలు. కానీ అరంగేట్ర టెస్టు సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలు. మంచి అవకాశాలను వృథా చేసుకుంటున్నాడనే వ్యాఖ్యలు. ఈ ఉపోద్ఘాతమంతా టీమ్‌ఇండియా ఆటగాడు రజత్‌ పటీదార్‌ గురించే. పూర్తి కథనం

2.ఇల్లు కట్టే వేళాయె.. 

లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఇప్పటికే నాలుగింటిని సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో హామీని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పూర్తి కథనం

3. ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం

కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా అనలిటిక్స్‌... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించటానికి, క్లినికల్‌ పరీక్షలను వేగంగా పూర్తిచేసి కొత్త మందులను ఆవిష్కరించడానికి కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ ఎంతగానో దోహదపడతాయని కన్సల్టెన్సీ సేవల సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అభిప్రాయపడింది.పూర్తి కథనం

4. నీళ్లు లేని ఊళ్లు

రూ.కోట్ల విలువ చేసే భూముల్లో ఉచితంగా ఇళ్ల పట్టాలిచ్చాం.. గృహాలు మంజూరు చేశాం.. ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నాం.. కాలనీల్లో నీటి సరఫరా, విద్యుత్తు, అంతర్గత రహదారుల నిర్మాణాలకు భారీగా నిధులు వెచ్చించినట్లు జగన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. కాలనీల్లో బిందెడు నీళ్లు ఇవ్వడం లేదు.. నీటి సౌకర్యం లేక లబ్ధిదారులు క‘న్నీటి’ యాతన పడుతున్నారు.పూర్తి కథనం

5. పైచేయి.. అలలదే!!

ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి శనివారం మధ్యాహ్నం చెల్లాచెదురవడం మళ్లీ కలకలం రేపింది. ఈ వంతెనను గత నెల 25న విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో వైకాపా నేతల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ఒక్క రోజులోనే ‘టి జాయింట్‌’ విడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారులు మాత్రం అలలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించి ఆ జాయింట్‌ను దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామని చెప్పుకొచ్చారుపూర్తి కథనం

6. ‘మద్యం మత్తులో తిట్టారంట’

అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే దానికి మరో మచ్చు తునక ఇది. ఓ జిల్లాస్థాయి అధికారిని ఓ వైకాపా కార్యకర్త భార్య బదిలీ విషయంలో బూతులు తిడుతూ, బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఆయన అదంతా మద్యం మత్తులో చేశారని పుంగనూరు పోలీసులు తేల్చారు.పూర్తి కథనం

7. అడిగినంత ఇస్తేనే మీసేవ

జనన, మరణ ధ్రువపత్రాలు కావాలంటే ఎవరైనా వెళ్లేది మీసేవా కేంద్రాలకే. అయితే ఈ కేంద్రాలు అక్రమార్జనకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన రుసుంకంటే అధికంగా వసూలు చేస్తున్నాయి. పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది.. మీసేవా కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నట్లు ఆరోపణలున్నాయి.పూర్తి కథనం

8. ఊదేసి దొరికారో.. బాదేసి వదిలేస్తారు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులు కేవలం చలానాలు, న్యాయస్థానం విధించే శిక్షలకే కాదు.. అనధికార జరిమానాలకు సిద్ధమవ్వాల్సిందే. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని కొన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది చేతివాటమే ఇందుకు కారణం. కొందరు స్వాధీనం చేసుకున్న వాహనం బూచీగా చూపించి అందినకాడికి వసూలు చేస్తున్నారు.  పూర్తి కథనం

9. మార్చి రాక.. మొదలైన కాక

హైదరాబాద్‌ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్చి రాకతో కాక మొదలైంది.  శనివారం మోండా మార్కెట్‌లో గరిష్ఠంగా 38.6 డిగ్రీలు, సరూర్‌నగర్‌లో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.పూర్తి కథనం

10. అధికార అనకొండలు!

కొండలు, గుట్టల్ని కొంతమంది అధికార వైకాపా నేతలు అనకొండల్లా మింగేస్తున్నారు. వీటిని పిండి చేస్తూ మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆపై పొలాలుగా మార్చుకుని కబ్జాకు పాల్పడుతున్నారు. ఈ దందా అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా సాగుతోంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు