Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Mar 2024 21:13 IST

1. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి తుమ్మల

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో ఎన్డీయే కూటమికే లోక్‌సత్తా మద్దతు: జేపీ

ఆంధ్రప్రదేశ్‌లో భాజపా, తెదేపా, జనసేన (ఎన్డీయే) కూటమికి మద్దతిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తాయిలాలకు తెరలేపిన వైకాపా.. సత్తెనపల్లిలో చీరలు స్వాధీనం

ఓటర్లను ఆకర్షించేందుకు వైకాపా నాయకులు తాయిలాలకు తెరలేపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు దాదాపు 2వేల చీరలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు విజయభాస్కర్‌రెడ్డికి చెందిన కేవీఆర్‌ మార్టులో ఓటర్లకు పంచేందుకు చీరలు సిద్ధంగా ఉంచారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి పచ్చజెండా

తెలంగాణలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని 5,348 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌ జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో మరోసారి అయ్యర్‌ కమిటీ పర్యటన..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటిస్తోంది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంది. మూడు ఆనకట్టల బాధ్యతలు నిర్వహించిన ఇంజినీర్లతో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సమావేశమైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వైకాపా కుట్రలు అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలి: చంద్రబాబు

రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైకాపాను ఇంటికి పంపేందుకు పౌరులు బాధ్యత తీసుకుని ముందడుగు వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్.. ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నారని మండిపడ్డారు. వైకాపా ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు.. సందడి చేసే స్టార్లు వీరే!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ఆరంభానికి అంతా సిద్ధమైంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు కోసం చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం (చెపాక్‌)ను మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. -22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రీ వెడ్‌ షూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

ప్రీ వెడ్‌ షూట్‌ కోసం మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ ఇన్‌ప్లూయెన్సర్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మంచులో ప్రీ వెడ్ షూట్‌ చేయాలనేది ఆర్య వోరా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కల. ఇందుకోసం గత వారం ఆమె కాబోయే భర్తతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతానికి చేరుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గ్వాదర్‌ పోర్ట్‌పై బలూచ్‌ మిలిటెంట్ల దాడి.. 8 మంది మృతి

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ (సీపెక్‌)లో భాగమైన పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై దాడి జరిగింది. సాయుధులైన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా సంఘటనా స్థలికి చేరుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పుతిన్‌కు శుభాకాంక్షలు.. జెలెన్‌స్కీకు భరోసా.. ఇద్దరు అధ్యక్షులకు మోదీ ఫోన్‌

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని ఉద్ఘాటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని